
శ్రీనగర్: గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కీలక పురోగతి సాధించింది. నిందితులకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018–19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారు. పాకిస్తాన్ ఉగ్రవాది, పేలుడు పదార్థాల నిపుణుడు అయిన మొహ్మద్ ఉమర్ ఫరూక్, పాకిస్తాన్‌కే చెందిన కమ్రాన్, ఇస్మాయిల్ అలియాస్ ఇబ్రహీం, అలియాస్ అద్నాన్‌లు తౌఫిక్ ఇంట్లోనే బస చేశారు. ‘మొహ్మద్ ఉమర్‌తో ఇన్షా జాన్ టెలిఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగించింది. అతడు చనిపోయే దాకా ఈ సంబంధాలు కొనసాగాయని మా దర్యాప్తులో తేలింది’అని ఎన్‌ఐఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment