![Photo Morphing Couple Arrested In Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/14/google77777.jpg.webp?itok=FEU46Akw)
సాక్షి, బొమ్మలసత్రం: ఓ మహిళా మరో వ్యక్తితో కలిసి ఫొటో దిగినట్లు ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ దైవప్రసాద్ తెలిపిన వివరాలు.. కర్నూలుకు చెందిన ఓ యువతి నవజ్యోతి హ్యుమన్‌రైట్స్ సభ్యురాలుగా ఉండేది. ఆమెతో పాటు నెహ్రూ నగర్‌కు చెందిన భార్య, భర్త శిరీష, రామకృష్ణారెడ్డి కూడా సభ్యులుగా ఉండేవారు. కొంత కాలం క్రితం యువతితో మనస్పర్థలు రావటంతో రామకృష్ణారెడ్డి, శిరీష నవజ్యోతి హ్యుమన్‌రైట్స్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఎలాగైనా యువతిపై కక్ష సాధించాలన్న ఉద్దేశంతో ఆమె ఫొటోను నవజ్యోతి హ్యుమన్‌రైడ్స్ అధ్యక్షుడి ఫొటోను సేకరించి అశ్లీలంగా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవిషయంపై యువతి స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు రామకృష్ణారెడ్డి, శిరీషలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment