
Model Shubham Malhotra Arrested: సినీ సెలబ్రిటీలు, మోడల్స్, అప్పుడే చిత్రసీమలోకి అడుగుపెడుతున్నవారు ఎందరో డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా మరో మోడల్ డ్రగ్స్‌తో ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. మోడల్ శుభమ్ మల్హోత్రా (25) అతడి స్నేహితురాలు కీర్తి (27) రూ. కోటీ విలువ చేసే మాదకద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్‌ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.
'కొందరు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దర్యాప్తు ప్రారంభించాం. తర్వాత మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఈ ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం' అని క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ రోహిత్ మీనా వెల్లడించారు. అయితే కీర్తి దిండు సాయంతో గర్భవతినని నమ్మించి తనిఖీ అధికారులను బురిడీ కొట్టించేదని దర్యాప్తులో తేలిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో వారి కారును వెంబడించి పట్టుకున్నామని పేర్కొన్నారు. మోడల్ శుభమ్ మల్హోత్రా, కీర్తిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
ఆ షాట్‌ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా..
Comments
Please login to add a commentAdd a comment