మేరే పీచే బాస్‌ హై!   | Malkajgiri ACP Narasimha Reddy Arrested In Illegal Assets Case | Sakshi
Sakshi News home page

వంద కోట్ల పోలీస్‌!

Published Thu, Sep 24 2020 4:31 AM | Last Updated on Thu, Sep 24 2020 1:04 PM

Malkajgiri ACP Narasimha Reddy Arrested In Illegal Assets Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు, మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ తరువాత ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం దొరికింది. విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలా సంపాదించిన డబ్బుతో రెండు తెలుగు రాష్ట్రా ల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మల్కాజిగిరి ఏసీ పీ నరసింహారెడ్డిపై బుధవారం దాడులు చేశా రు. తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీ బీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి.

వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుంద ని సమాచారం. రెండు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో... 25కు పైగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో నరసింహారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం సికింద్రాబాద్‌ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఎక్కడెక్కడ సోదాలు జరిగాయంటే..! 
ఏసీపీ స్థాయి అధికారి కోసం 25 కంటే ఎక్కువ బృందాలు రంగంలో దిగడం ఈ కేసుపై ఏసీబీ ఏస్థాయిలో దృష్టి పెట్టిందో తెలుపు తోంది. నరసింహారెడ్డి అవినీతి విస్తరణకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్‌లతోపాటు జన గామ జిల్లాలోని లింగాలఘణపురం మండ లం వడిచర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా గంగాధర, నల్లగొండ జిల్లా, ఏపీలోని అనంతపురం జిల్లాలో కలిపి మొత్తం 25 ప్రాంతాల్లో దాడు లు జరిగాయి. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వడిచర్లలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఏసీపీ మామ మోతె నర్సింహారెడ్డి అక్కడే ఉన్నారు. కుర్చపల్లి గ్రామంలోని పోరెడ్డి తిరుపతిరెడ్డి అనే బంధువు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదా చేశారు. అలాగే కొన్నె గ్రామం వద్ద సాగు భూమిని పరిశీలించారు. ఈ భూమిని బినామీ పేరిట ఏసీపీ కొన్నారని సమాచారం. మియాపూర్, బేగంపేట్, ఉప్పల్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా.. చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిల్లో భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. 

అసైన్డ్‌ భూముల వివాదాలే కారణమా? 
పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్‌లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్ర జాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. కొండాపూర్‌లోని అసైన్డ్‌ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్‌ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులను చూసి మధుకర్‌ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితోపాటు ఘటకేసర్‌ సమీ పంలోని యమ్నంపేట్‌లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్‌ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మధుకర్‌ ఆచూకీ దొరికితే.. అతని వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత లెవరు? ఇంతవరకూ వీరు కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూవ్యవహారాలపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..! 
అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్‌లోని సైబర్‌టవర్‌ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్‌పేటలో మూడం తస్తుల భవనం, రెండు ఓపెన్‌ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టినట్లు సోదాల్లో అధికారులకు ఆధారాలు లభించాయి. రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం.. రూ.7.5 కోట్లు ఉంటుందని, అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం.  

మేరే పీచే బాస్‌ హై!  
సాక్షి, హైదరాదాబాద్‌: ‘నా మీద ఎన్ని ఆరోణలు వచ్చినా.. నాకేం కాదు. నా వెనక డీజీపీ ఉన్నారు.. ఆయనే నాకు గాడ్‌ఫాదర్‌’ అంటూ ఏసీపీ వై.నరసింహారెడ్డి పలువురి వద్ద గొప్పలకు పోయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌ బాస్‌ దీన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ జరిపించారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో నెలరోజుల ముందే నరసింహారెడ్డి ఏసీపీ ఉన్నతాధికారుల నిఘాలోకి వెళ్లాడని సమాచారం. వాస్తవానికి వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్‌ అయినప్పటి నుంచే ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పటి నుంచే పక్కాగా విచారణ చేసిన ఏసీబీ అదును చూసి దాడులు చేసింది. ఉప్పల్‌ ఠాణాలో పనిచేసిన సమయంలో ఎస్సై లింగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నరసింహారెడ్డి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న సదరు ఎస్సై లింగం భూవివాదంలో తలదూర్చడంతో హెచ్చార్సీలో కేసు నమోదవడం గమనార్హం. 

బినామీగా బార్‌ ఓనర్‌! 
ఏసీపీ నరసింహారెడ్డికి నగరంలోని అశోక్‌పాటిల్‌ అనే ఓ బార్‌ యజమానితో సాన్నిహిత్యం ఉందని, అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఏసీపీ అక్రమ సంపాదనను అతడే మేనేజ్‌ చేసేవాడని సమాచారం. పోలీసుశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారికి నగరంలో కోట్ల రూపాయల విలువైన బంగళాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ బంగళాను బినామీ అశోక్‌పాటిల్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఘట్‌కేసర్‌ తహసీల్దార్‌ ఓ కేసు విషయంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీపీని ఉన్నతాధికారులు మందలించారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement