
సాక్షి, హైదరాబాద్: అవినీతికి చిరునామా గా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని సీఎం కేసీఆర్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావతారాల లీలలు బట్టబయలవుతున్నాయి. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నచోట ఏరికోరి పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ.. పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్యపై ఏసీబీ దాడులు జరిగాయి. వీటి లో ఆమె ఇంట్లో ఏకంగా రూ.93 లక్షల నగదు కట్టలు లభించాయి. ఈ తహసీల్దార్ అవినీతి పర్వంలో ఆఖరికి ఆమె భర్త హస్తం కూడా ఉన్నట్లు తేలడం.. ఇద్దరిపై నా సస్పెన్షన్ వేటు విదితమే.
తాజాగా ‘షాక్’పేట
తాజాగా మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. హైదరాబాద్ సంపన్నవర్గాలు నివసించే షేక్‌పేట మండ ల తహసీల్దార్ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కా రు. శనివారం తహసీల్దార్ సుజాత ఇంటి పై దాడి చేసిన అధికారులు.. రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్‌ఐ కూడా పట్టుబడ్డారు.
జేసీలు మొదలు.. వీఆర్వో వరకు..!
గతంలో శివారు జిల్లా జాయింట్ కలెక్టర్‌పై ఏసీబీ దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కటకటాల వెనక్కి నెట్టిం ది. ఇదే జిల్లాలో పనిచేసిన ఓ ఆర్డీవో కూడా ఏసీబీ వలలో చిక్కారు. ఆ తర్వాత శేరిలిం గంపల్లి తహసీల్దార్‌గా పనిచేసిన మహిళాధికారి కూడా పట్టుబడ్డారు. ఇక అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం కేసులోను అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఆ జిల్లాల్లోనే తిష్ట..
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. దశాబ్ధాల కాలంగా నయాబ్ తహసీల్దార్ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు వెలగబెడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇతర జి ల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment