ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌ | ACB Attack On AE Office At Pedda Shahpur | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌

Published Mon, Sep 9 2019 2:40 PM | Last Updated on Mon, Sep 9 2019 2:54 PM

ACB Attack On AE Office At Pedda Shahpur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. కాశీరాములు.. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మీటర్ ఫిట్ చేసినందుకు 50 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటుండగా లైన్‌మన్‌ను పట్టుకున్నారు. సోమవారం రూ.28 వేలు లంచం తీసుకుంటూ కాశీరాములు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement