Shamshabad mandal
-
ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. కాశీరాములు.. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మీటర్ ఫిట్ చేసినందుకు 50 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటుండగా లైన్‌మన్‌ను పట్టుకున్నారు. సోమవారం రూ.28 వేలు లంచం తీసుకుంటూ కాశీరాములు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. -
రామయ్యా.. ఊపిరి పీల్చుకో
శంషాబాద్ రూరల్: అత్యంత విలువైన ఆలయం భూములు కబ్జా చెర వీడాయి. అక్రమంగా ఈ భూములను కాజేసి ఏర్పాటు చేసిన వెంఛరులోని నిర్మాణాలు, హద్దురాళ్లను తొలగించిన దేవాదాయశాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని నర్కూడ సమీపంలో ఉన్న అమ్మపల్లి (శ్రీసీతారామచంద్రస్వామి) ఆలయానికి సర్వే నంబరు 47లో 32 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను గతంలో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారు. అంతేకాకుండా అందులో వెంఛరు ఏర్పాటు చేసి ప్లాట్లను అమ్ముకున్నారు. వివాదంగా మారిన ఈ భూముల హక్కుల కోసం దేవాదాయశాఖ ‘తెలంగాణ ఎండోమెంట్ ట్రిబ్యునల్’లో కేసు వేసింది. సుమారు రెండు దశాబ్దాలుగా వివాదంగా ఉన్న ఈ భూములు అమ్మపల్లి దేవాలయానికి చెందినవి ట్రిబ్యునల్‌లో నాలుగు నెలల కిందట తీర్పు వచ్చింది. దీంతో బుధవారం దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు భద్రతతో వచ్చి ఈ భూముల్లోని నిర్మాణాలను, ప్లాట్ల హద్దురాళ్లను జేసీబీలతో తొలగించారు. ఈ భూముల విలువ దాదాపు రూ.100 కోట్ల ధర పలుకుతుంది. బాధితుల ఆందోళన.. పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఆలయానికి చెందినదంటూ తమను వెళ్లగొట్టడంపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలు జరుగుతున్నట్లు తెలుసుకున్న పలువురు బాధితులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లను కొనుగోలు చేసిన పేద, మధ్య తరగతికి చెందిన బాధితులు ఎక్కువగా ఉన్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు మేరకు చర్యలు కోర్టు తీర్పు మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.ఎన్.సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లపై కూడా దాదాపు ఐదేళ్ల నుంచి నిషేధం ఉందని, ఆలయానికి చెందిన భూములను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ సుజిత్‌రెడ్డి, ఏఆర్ఐ ఇంద్రసేనారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు మధుబాబు, ప్రణీత్, ఈఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ మండలంలో బస్సు బోల్తా
హైదరాబాద్: శంషాబాద్ మండలం పెద్ద గోల్కోండ వద్ద శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ స్కూలు బస్సు బోల్తాపడింది. బస్స పఠాన్‌చెరువు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకుఏ సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
శంషాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలో బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో పెద్ద గోల్కొండ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆగివున్న లారీని మరో లారీ వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో లోడ్ తో ఉన్న లారీ బోల్తా పడింది. బోల్తా పడిన లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. కాగా, గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.