
సాక్షి, హైదరాబాద్: మల్కాస్‌గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్‌మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment