అవన్నీ ఫేక్.. అలా చేయొద్దంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్! | Parineeti Chopra WARNS Fan Pages Against Posting Quotes Using Her Name | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: 'ముందు నిజమేంటో తెలుసుకోండి'.. పరిణీతి స్ట్రాంగ్ వార్నింగ్!

Published Sun, Nov 26 2023 1:19 PM | Last Updated on Sun, Nov 26 2023 2:18 PM

Parineeti Chopra WARNS Fan Pages Against Posting Quotes Using Her Name - Sakshi

ఈ ఏడాది పెళ్లిబంధంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా.  ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు సెప్టెంబరు 24, 2023న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.  వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న బ్యూటీ సోషల్ మీడియా ఫ‍్యాన్స్, ఫ్యాన్‌ క్లబ్స్‌ పేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కొందరు తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగిస్తున్నారని పరిణీతి మండిపడింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'నా పేరుని ఉపయోగించి కొందరు ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటులకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివీ చాలా నా దృష్టికి వచ్చాయి. నా పేరుతో వస్తున్న ఇలాంటి పోస్టులన్న నకిలీవి. ఇలా ఏ ఒక్కరినీ పొగిడేందుకు నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వడం లేదు. ఇలా మరోసారి జరిగితే కచ్చితంగా ఫిర్యాదు చేస్తా . మీరు ఏదైనా పోస్టు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోండి.' అంటూ కాస్తా ఘాటుగానే ఇచ్చిపడేసింది. కాగా..  2011లో బాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా ఆ తర్వాత శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, కిల్‌ దిల్‌, డిష్యూం, కేసరి, సైనా, ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌ చిత్రాల్లో ఆమె నటించారు. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్‌లో కనిపించింది. ఆమె ప్రస్తుతం చమ్కిలా చిత్రంలో దిల్జిత్ దోసాంజ్‌తో స్క్రీన్‌ పంచుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement