
రజనీకాంత్... కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా సూపర్ స్టార్. స్టయిల్‌తో, గ్రేస్‌తో భాష, ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రజనీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 ఏళ్లు కావస్తోంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ ద్వారా తెరపై కనిపించారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న వారికి ట్విట్టర్ ద్వారా రజనీ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘సినిమాల్లో నా ప్రయాణం 45 ఏళ్లుగా సాగుతోంది. నన్ను ఆదరించిన వాళ్లకు, ఈ ప్రయాణంలో తోడ్పడినవాళ్లకు, మరీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేను’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment