
సాక్షి,న్యూఢిల్లీ: రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ తో ఆకట్టుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల కోసం కలం పట్టిన బుక్ జనం ముందుకు వచ్చింది. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ‘ఎగ్జామ్ వారియర్స్’ తో ఈ బుక్‌ను విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో శనివారం విడుదల చేశారు. పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఇవాళ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ శక్తిని తెలుసుకొని తెలివిగా వ్యవహరించాలని సుష్మా విద్యార్థులకు సూచించారు.
గత ఏడాది ఫిబ్రవరి 16న మన్ కీ బాత్ లో విద్యార్థుల పరీక్షల భయం గురించి మాట్లాడుతూ.. వర్రీయర్స్‌గా కాదు వారియర్స్‌గా మారి పోరాడాలంటూ ఉద్బోధించారు. ఒక సంవత్సరం కఠోర శ్రమ తరువాత తమ సామర్థ్యాలను ప్రదర్శించే పరీక్షలను ఒక సంతోషకరమైన సందర్భంగా చూడాలి.. ఒక పండుగలా పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులు పరీక్షలను ఓ పండుగలా భావించి రాయాలని.. అప్పుడు ఎటువంటి ఒత్తిడి ఉండదని విద్యార్థులనుద్దేశించి మోదీ సూచించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి తన పుస్తకం ఇస్తుందని మోదీ చెప్పారు. కచ్చితంగా యువతలో ముఖ్యంగా పరీక్షలను రాసే విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనే ఆశాభావాన్ని పీఎం వ్యక్తం చేశారు. 10, 12 తరగతుల విద్యార్థులు ఎగ్జామ్స్ ఒత్తిడిని జయించి.. పరీక్షల్లో విజయం ఎలా సాధించాలనే విషయాలను మోదీ ఆ పుస్తకంలో పొందుపరిచారట. పరీక్షల ఒత్తిడిని జయించడం, ఏకాగ్రతను సాధించడం, చదువు పూర్తయ్యాక కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఇలాంటి అంశాలపై ప్రధాని మోదీ యువతకు తన పుస్తకంలో సూచనలు, సలహాలతో రూపొందించారు. తాజా ఆవిష్కరణతో నరేంద్ర మోదీ యాప్ ద్వారా ఈ ఎగ్జామ్ వారియర్ గ్రూప్‌లో జాయిన్ కావచ్చు.


Comments
Please login to add a commentAdd a comment