
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని ఇన్‌స్టాగ్రామ్ పిక్స్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తన భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిన ఆమె అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అద్బుతమైన ఫోటోలతో సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం ఈతకు వెళ్లిన ఆమె బికినీ ఫోటోలను షేర్ చేశారు. నీలినీలి ఆకాశం, బ్లూ సీ రిఫ్లెక్షన్‌లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసిన బాత్‌టబ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆహ్లాదకరమైన సముద్రతీరంలో, డాల్సిన్లతో ఈత కొడుతూ, సైకిల్‌పై చక్కర్లు కొడుతూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా సమంతా షేర్ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. (కొడుకుతో నటి క్రికెట్ : ఫోటోలు చూస్తే ఫిదానే)
Comments
Please login to add a commentAdd a comment