త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది! | director trivikram posted his new film photo | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!

Published Wed, Feb 24 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!

త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!

క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ..' (అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ తమిళనాడు పొల్లాచిలో తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక్కడ సినిమా చిత్రీకరణ ముగియడంతో ఆనందంతో చిత్ర యూనిట్‌ ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను డైరెక్టర్ త్రివిక్రమ్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు చేశారు. హీరో నితిన్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్‌ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'అ..ఆ..' చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావటం ఏప్రిల్కు వాయిదా వేశారు. ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement