పక్కపక్కనే ఉంటూ.. పరిచయానికి పాతికేళ్లు | Nithin, Trivikram, Samantha's movie 'A.. aa' trailer released | Sakshi
Sakshi News home page

పక్కపక్కనే ఉంటూ.. పరిచయానికి పాతికేళ్లు

Published Wed, Apr 13 2016 8:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

పక్కపక్కనే ఉంటూ.. పరిచయానికి పాతికేళ్లు

పక్కపక్కనే ఉంటూ.. పరిచయానికి పాతికేళ్లు

అ, ఆ.. పక్కపక్కనే ఉండే ఈ రెండు అక్షరాలు తమనితాము పరిచయం చేసుకోవటానికి మాత్రం పాతికేళ్లు పట్టిందట.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తసినిమా 'అ.. ఆ'లో! హీరోయిన్ సమంతా చెప్పే ఈ డైలాగ్ తో ఎండ్ అయ్యే 'అ.. ఆ' మూవీ టీజర్ బుధవారం విడుదలైంది. వెండితెరపై క్లీన్ లవ్ స్టోరీలు చెప్పటంలో అందెవేసిన త్రివిక్రమ్ 'అ.. ఆ'ను కూడా అదే తరహాలో రూపొందించారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

అనసూయా రామలింగం(సమంత), ఆనంద్ విహారి(నితిన్) ల జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, వాళ్లిద్దరూ ఎలా ఒక్కటవుతారు? వారి ప్రేమకు ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమిస్తారు అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాకు మిక్కీ మ్యూజిక్ అందించటం ఇదే మొదటిసారి. మేలో రిలీజ్ కానున్న 'అ.. ఆ'ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌లతో పాటు నదియ, అనన్య, ఈస్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement