సమంత కొరియోగ్రఫీలో నితిన్ ఏం చేశాడంటే.. | nithin action Samantha choreographed video released | Sakshi
Sakshi News home page

సమంత కొరియోగ్రఫీలో నితిన్ ఏం చేశాడంటే..

Published Sat, Mar 26 2016 6:52 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

సమంత కొరియోగ్రఫీలో నితిన్ ఏం చేశాడంటే..

సమంత కొరియోగ్రఫీలో నితిన్ ఏం చేశాడంటే..

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని నితిన్ మరోసారి చూపించాడు. దీనికి నటి సమంత, దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా తోడయ్యారు. నితిన్, సమంత, మలయాళ 'ప్రేమమ్' ఫేమ్ అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న తాజా చిత్రం 'అ...ఆ...'(అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ వేసవిలోనే మే 6న రిలీజ్‌కు చేసే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.

అయితే పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ట్రయిలర్‌లోని ఓ సన్నివేశాన్ని నితిన్ అనుకరించాడు. ఓ చెక్క బొమ్మ పై పవన్ కల్యాణ్ అటూ ఇటూ ఊగుతూ ఉండే సన్నివేశం సర్ధార్ గబ్బర్ సింగ్ ట్రయలర్‌లో కనిపిస్తుంది. అయితే సరిగ్గా అలానే నితిన్ కూడా చేశాడు. దీనికి నటి సమంత కొరియోగ్రఫీ చేయగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడని నితిన్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నాడు. ప్రతి వేసవిలో పవన్ నుంచి వచ్చే మామిడి పళ్లను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం చూశాం. అయితే ఈ సారి ఈ రకంగా తనకు పవన్ మీదున్న అభిమానాన్ని మరోసారి చూపించుకున్నాడు నితిన్.

 

 

Look what just happened on our sets of A Aa.. choreographed by Samantha Ruth Prabhu and directed by Trivikram garu.. ☺ ☺ ☺

Posted by Nithiin on Saturday, March 26, 2016

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement