
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్‌లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్‌పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతుంది.
(ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!)
పూజానే ఎందుకు?
పూరి డైరెక్షన్‌లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్‌కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్‌గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్‌తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు.
(ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్‌గా ఎప్పుడైనా చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment