ఆ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫ్యామిలీస్టార్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ | The Family Star Pre Release Event Date Locked | Sakshi
Sakshi News home page

ఆ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫ్యామిలీస్టార్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Published Mon, Apr 1 2024 1:55 PM | Last Updated on Mon, Apr 1 2024 2:46 PM

The Family Star Pre Release Event Date Locked - Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’ మరో కొద్దిరోజుల్లో థియేటర్‌లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు - శిరీశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విడుదల తేది దగ్గరపడుతుండటంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు స్పీడ్‌ అందుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్‌ 2న ఫ్యామిలీస్టార్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని మైసమ్మగూడ వద్ద ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాయింత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.  ఈ మేరకు చిత్ర మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. 'గీత గోవిందం' కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ... సినిమాలో వినోదంతో పాటు ఫైట్స్‌, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్‌ ఎంటర్‌టైనర్‌ అని పేర్కొన్నారు. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే అంటూ ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement