Janaganamana
-
సీనియర్ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్‌పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!) పూజానే ఎందుకు? పూరి డైరెక్షన్లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్‌కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్‌తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు. (ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్‌గా ఎప్పుడైనా చూశారా?) -
వరుస ఫ్లాప్స్.. తగ్గని క్రేజ్..దూసుకెళ్తున్న పూజా హెగ్డే
ఈ ఏడాది స్టార్టింగ్ నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస షాక్స్ ఎదురవుతున్నాయి.ఆమె కనిపించిన ప్రతి సినిమా బాక్సఫీస్ దగ్గర బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ వెళ్లి చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. అన్ని కూడా పూజా స్పీడ్ కు సడన్ బ్రేక్స్ వేసిన సినిమాలే.కెరీర్ బిగినింగ్ లోనూ ఇలాంటి ఫేజ్ ను చూసింది పూజ. అయితే అప్పుడు తన కెరీర్ గురించి భయపడింది. కాని ఇప్పుడు తగ్గేదేలేదు అంటోంది బుట్టబొమ్మ. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తన కెరీర్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏం లేదనే ధైర్యంతో పూజా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజ పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో బిగ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటోంది. అందుకే చాలా అంటే చాలా బిజీగా పరులుగు తీస్తోంది.బాలీవుడ్ లో సర్కస్, కభీ ఈద్ కభీ దివాళి, టాలీవుడ్ లో పూరి డైరెక్ట్ చేస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ జనగణమన, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రంలో నటించనుంది.శాండల్ వుడ్ లో కేజీయఫ్ 2 తర్వాత రాఖీభాయ్ నటించే నెక్ట్స్ ప్రాజెక్ట్ లోనూ, కోలీవుడ్ లో సూర్యతో కొత్త సినిమాలోనూ కనిపించబోతోంది. -
మనసు మార్చుకున్న జాన్వీ కపూర్.. ఇక టీటౌన్పైనే ఫోకస్!
దఢక్‌తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే ఫేమస్ అయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు మన డైరెక్టర్ట్స్ అండ్ ప్రొడ్యూస్స్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కానీ జాన్వీ మాత్రం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. ముందు బాలీవుడ్లో స్టార్డమ్ అందుకున్న తర్వాతే సౌత్ వైపు చూడాలనుకుంటోంది. అందుకే ఇంత కాలం టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె మనసు మారిందట. బాలీవుడ్ లీడింగ్ లేడీస్ దీపిక, ఆలియాల మాదిరే జాన్వీ కూడా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందట. అయితే ఈ రెండూ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఒకటి పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ జనగణమన, మరోకొటి కరణ్ జోహర్ అక్కినేని హీరో అఖిల్ తో ప్లాన్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అట. మరి టాలీవుడ్లో జాన్వీ లక్ ఎలా ఉంటుందో చూడాలి. -
మహేశ్‌ను పక్కన పెట్టిన పూరి... ఆ స్టార్ హీరోతో ‘జనగణమన’!
ప్రతీ దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. పెద్ద కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడం అనేది ప్రతీ డ్రీమ్ మేకర్ కు ఉంటుంది. కాకపోతే అందుకు సరైన సమయం కావాలి.ఇప్పుడు పూరి జగన్నాథ్ కు అలాంటి సమయమే వచ్చింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఇదే సరైన సమయం అని డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ అనుకుంటున్నారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో అందరికి తెలిసిందే. ఎప్పటికైనా ‘జనగణమన’మూవీని తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నాడు. బిజినెస్ మెన్ తర్వాత మహేశ్ బాబుతో పూరి చేయాల్సిన చిత్రమిది. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత వీరిద్దరు ఈ సినిమాపై డిస్కస్ కూడా చేశారు. కానీ ప్రిన్స్ వైపు నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించకపోవడంతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టాడు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అందుకే జనగణమన వైపు పూరి మళ్లీ దృష్టి పెట్టాడట. లైగర్ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ లాంటి మహామహులతో పాన్ ఇండియా లెవల్లో జనగణమన ప్లాన్ చేస్తున్నాడట పూరి. ఇక లైగర్ విషయానికొస్తే.. . విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తోంది. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్.. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్‌తో ఆగిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తర్వాత దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. -
సంతూర్‌పై జనగణమన.. గూస్బంప్స్ వస్తున్నాయి!
న్యూఢిల్లీ: జాతీయ గీతం వింటే చాలు భారతీయుల గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగిపోతాయి. త్రివర్ణ పతాకానికి వందనం చేస్తూ జనగణమన ఆలాపిస్తున్న సమయంలో భక్తి భావంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పంద్రాగష్టు పండుగ సందర్భంగా ఆదివారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిన వేళ ఇలాంటి సన్నివేశాలు అనేకం చోటుచేసుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ సహా పలు కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్ ట్విటర్లో పంచుకున్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చెందిన తారా ఘహ్రెమని అనే యువతి గతంలో భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సంతూర్‌పై భారత జాతీయ గీతం జనగణమనను వాయించింది. అయితే, ఈ పాత వీడియోను వెలికితీసిన రామెన్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఎంతో హృద్యంగా ఉంది. గూస్బంప్స్ వస్తున్నాయి. ఇంతబాగా ప్లే చేసినందుకు థాంక్స్ తారా’’ అంటూ సదరు యువతికి నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. National anthem in any form would give us goosebumps. Many thanks to this Iranian girl for this beautiful performance. #happyindependenceday 🇮🇳 pic.twitter.com/KhyylXsP0W — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) August 15, 2021 -
నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత
కోహిమా: శాసనాలు రూపొందించే చట్టసభలో దాదాపు 58 ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు. దేశవ్యాప్తంగా ‘జనగణమన’ ఆలపించడం సంప్రదాయం. కానీ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ అసెంబ్లీలో మాత్రం ఇంతవరకు జాతీయ గీతం ఆలపించలేదు. ఐదు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ఇప్పుడు జనగణమనను సభ్యులు పాడారు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభమవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1962లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆ అసెంబ్లీలో జనగణమనను ప్రజాప్రతినిధులు ఆలపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఈ పరిణామం ఫిబ్రవరి 12వ తేదీన శుక్రవారం ప్రారంభమైంది. మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తేమ్జన్ ఇమ్నా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఆలపించడం లేదో తమకు తెలియదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. స్పీకర్ షరిన్‌గైర్ లాంగ్‌కుమార్ నేతృత్వంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగింది. 58 years after Nagaland became a state, Jana Gana Mana played in the assembly for the first time. Members of the Assembly stand as the National Anthem “Jana Gana Mana” is played in the House for the very first time in the history of the Nagaland Legislative Assembly. pic.twitter.com/nHLauZhucv — Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) February 19, 2021 -
మహేశ్ కాదనుకుంది పవన్ ఓకే చెప్తాడా?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్ "జనగణమన". దీన్ని పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తానని కొన్నేళ్ల క్రితం ప్రకటించాడాయన. కానీ ఎంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూనే వస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీస్తున్నట్లు వెల్లడించాడు పూరీ. కానీ అకస్మాత్తుగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అంతేకాదు, భవిష్యత్తులోనూ మహేశ్‌తో సినిమాలు చేయనని పూరీ ప్రకటించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. (చదవండి: పవన్ కల్యాణ్, రానా యాక్షన్) ముచ్చటగా మూడోసారి చర్చలు అయితే ఆ తర్వాతి కాలంలో మహేశ్ తన ఫేవరెట్ డైరెక్టర్ పూరీ అని చెప్పడమే కాక, ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో జనగణమన తిరిగి పట్టాలెక్కుతుందని అంతా భావించారు, కానీ అలా జరగలేదు. తాజాగా ఈ సినిమా కథను పవన్ కల్యాణ్‌కు వినిపించాడట పూరీ. ఇప్పటికే హైదరాబాద్‌లో వీళ్లిద్దరూ రెండు సార్లు సమావేశమై కథ గురించి చర్చించారట. కానీ పవన్ చేతిలో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు ఉండటంతో ఆయన ఏమీ స్పందించడం లేదట. లేటైనా సరే కానీ పవన్‌తోనే చేసేందుకు పట్టుపడుతున్నాడట పూరీ. దీంతో మూడో దఫా చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్‌కు ముందు జనగణమన ఇక ఈ సినిమాను రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు పూరీ. దీంతో పొలిటికల్ పంచులతో సాగే ఈ సినిమా తనకేమైనా ప్లస్ అవుతుందేమోనని సినిమాలో నటించేందుకు పవన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి 'కెమెరామన్ గంగ'తో రాంబాబు ఫ్లాఫ్ కావడంతో పవన్.. పూరీని పక్కన పెట్టేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ అదంతా గతం. ఇప్పుడు పవన్ మరోసారి అతడితో కలిసి ప్రయాణం మొదలు పెట్టేందుకు సుముఖత చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమా మొదలు పెట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పూరీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' చేస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్లో ఓ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. అటు పవన్ కూడా బోలెడన్ని సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్లో భారీ అగ్ని ప్రమాదం) -
మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్
హైదరాబాద్: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ను అతి త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తాని వెల్లడించారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ‘జనగణమన’ తెరకెక్కించాలని చాలా ప్రయత్నించినట్లు తెలిపారు. ఫాదర్స్‌డే సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పూరి ఈ విషయాన్ని తెలిపారు. దేశానికి కావాల్సిన సినిమా అని అదేవిధంగా తను తప్పకుండా తీయాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దేశభక్తితో కూడిన ‘జనగణమన’ చిత్రం దేశంలోని ప్రతీ ఒక్కరు చూసే విధంగా ఉంటుందన్నారు. (సితు పాపను ఓడిస్తూ తాను ఓడిపోతూ) అంతేకాకుండా ఈ చిత్రం మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని వివరించారు. అయితే ఈ చిత్రంలో నటించే హీరో ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిగురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గల్వాన్ ఘటనపై ఓ కథ రాస్తున్నట్లు పూరి జగన్నాథ్ తెలిపారు. మిలటరీ అంటే తనకు ఎంతో ఇష్టమని, సైనికులు చేస్తున్న త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని వివరించారు. (నాన్న అంటే ప్రేమ.. ధైర్యం) పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాల తర్వాత మహేశ్ బాబుతో ‘జనగణమన’ చిత్రం చేయాలని పూరి భావించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్ర కథ నచ్చినప్పటికీ పూర్తి స్క్రిప్ట్‌పై మహేశ్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. పలుమార్లు స్క్రిప్ట్‌ను మార్చినప్పటికీ మహేశ్ ఒప్పుకోకపోవడంతో ‘జనగణమన’ను పూరి పక్కకు పెట్టారనే వార్తలు వచ్చాయి. ఇస్మార్ట్ శంకర్‌తో విజయం అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. (చార్మి బర్త్‌డే : పూరీ ఎమోషనల్ ట్వీట్) అయితే ఈ లాక్డౌన్ సమయంలో ‘జనగణమన’ స్క్రిప్ట్‌ను మరింత మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. విజయ్ చిత్రం తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక పూరి-మహేశ్ కాంబోలో మరో సినిమా రావాలన్ని సూపర్‌స్టార్ ఫ్యాన్స్ తెగ ఆశపడుతున్నారు. మరి అన్ని వివాదాలను పక్కకుపెట్టి తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ను మహేశ్‌తో తీస్తారా? లేక వేరే హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కొస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. (ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి) -
వందేమాతరంకు ఆ హోదా ఇవ్వలేం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గీతం ‘జనగణమన’తో పాటుగా ‘వందేమాతరం’ గేయానికి కూడా సమాన హోదా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జాతీయ గీతం, జాతీయ గేయాలకు మరింత ప్రచారం కల్పించే విధంగా జాతీయ విధానాన్ని తీసుకురావాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కూడా ఉపాధ్యాయ్ తన పిటిషన్లో కోరారు. అన్ని పాఠశాలల్లోనూ ఈ రెండు గీతాలను ఆలపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ హైకోర్టుకు విన్నవించారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ.. పిటిషన్‌ను తొసిపుచ్చింది. కాగా జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా సమానంగా గౌరవించాలంటూ 2017లో ఢిల్లీ హైకోర్టులో ఇదే తరహా పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే. అయితే భారతీయుల మదిలో ‘వందే మాతరం’ గేయానికి ప్రత్యేక స్థానం ఉందంటూ కేంద్రం ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ‘జన గణ మన’తో సమానంగా దీన్ని పరిగణించలేమని తేల్చిచెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. -
జన గణ మనకు 'వంద'నం
అఖండ భారతావనిని ఒక్కటి చేసిన జనగణమన గీతానికి వందేళ్ల పండుగొచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విరచించి తొలిసారి స్వయంగా ఆలపించి ఈ గీతం ఈ నెల 28 నాటికి వందో ఏట అడుగుపెడుతోంది. ఆ మహనీయుడు ఆలపించింది మరెక్కడో కాదు.. మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో..అందరం ఒక్కటే..మనందరి గీతం ఒక్కటేనంటూ జాతికి అంకితం చేసిన జాతీయగీతానికి బాణి కట్టింది కూడా ఇక్కడే.. వేష, భాషలు వేరైనా, కట్టుబాట్లు, విశ్వాసాలు విభేదించినా, రైతు నుంచి సరిహద్దులో సైనికుడి వరకు, పలుగు, పార పట్టే శ్రామికుడి నుంచి మరయంత్రాల మధ్య నరయంత్రంలా పని చేసే కార్మికుడి వరకు ఏ గీతం వింటే గుండె నిండా దేశభక్తి అలుముకుంటుందో ఆ జనగణమనకు రేపేశత వసంతాల సంబరం జరుగనుంది. మదనపల్లె సిటీ వందేళ్ల ఉత్సవాలకు శ్రీకారం ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహణకు కళాశాల యాజమాన్యం కసరత్తులు ప్రారంభించారు. కళాశాల కరస్పాడెంట్ విజయభాస్కర్‌చౌదరి, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఉత్సవాలను ఆహ్వానించారు. ఠాగూర్ కాటేజీ రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన గదిని కాటేజీ ఏర్పాటు చేశారు. అందులో విశ్వకవి చిత్రపటాలను పెట్టారు. కాటేజీ ఎదురుగా రవీంద్రుడి 90 కిలోల పాలరాతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఠాగూర్ ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది. లక్ష గళార్చన విశ్వకవి రవీంద్రుడి 150 జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 2012లో బి.టి.కళాశాలలో లక్ష గళార్చన నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 20 వేల విద్యార్థులచే ఐదు సార్లు జాతీయగీతం ఆలపించారు. దక్షిణ భారతదేశంలో శాంతినికేతన్‌గా పేరుపొందిన బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల(బి.టి) జాతీయగీతం వందేళ్ల పండుగకు ముస్తాబవుతోంది. విశ్వ కవి రవీంద్రనాథ్ఠాగూర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చరిత్రలో చెరగని స్థానం దక్కింది. మారుమూల ప్రాంత యువతకు విద్యను అందించాలన్న ధ్యేయంతో 1915లో డాక్టర్ అనిబీసెంట్ ఏర్పాటు చేసిన బీటీ కళాశాల స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎందరెందరో దేశభక్తులను తయారు చేసింది. తొలిసారిగా.. దక్షిణ భారతదేశ పర్యటనను బెంగుళూరుకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విశ్రాంతికి 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు విచ్చేశారు. ఇక్కడ వాతావరణానికి ముగ్ధుడైన ఆయన మార్చి 2 వరకు మదనపల్లెలోని బి.టి.కళాశాలలో బస చేశారు. ఈ సమయంలో ఇండోర్ గేమ్స్, సంగీత పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో విద్యార్థుల గళం నుంచి జాలువారిన దేశభక్తి గీతాలకు స్పందించిన ఠాగూర్ పోటీల అనంతరం ఆర్ట్స్ రూములో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను బెంగాల్ భాషలో రాసిన జనగణమణ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పటి బీటీ కళాశాల ప్రిన్సిపాల్ జేమ్స్ హెచ్.కజిన్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చారు. కళాశాలలో పెద్ద ఎత్తున జరిగిన పోటీల్లో ముగింపు సమావేశంలో ఈ గీతాన్ని తొలిసారిగా తానే స్వయంగా ఆలపించారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న జనగణమణను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయగీతంగా ప్రకటించింది. 1950 జనవరి గణతంత్ర దినోత్సవాల్లో జాతీయగీతాన్ని అధికారికంగా మెట్టమొదట ఆలపించారు. మన జాతీయగీతానికిఅర్థం ఇది.. ‘జనులందరి మనస్సుకూఅధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగ ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత విధాతా! వాటికి నీ శుభ నామం ఉద్భోద కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళ ప్రదాతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’ -
యాభై రెండు సెకన్ల జీవితం
పద్ధతి గల జీవితానికి లయ ఉంటుంది. లక్ష్యం ఉంటుంది. ఆ లయ, లక్ష్యం పైకి కనిపించకపోవచ్చు. కానీ మనిషిని చూసి చెప్పేయొచ్చు. ఆఫీస్ టైమ్ అయిపోతోందనీ, మీటింగ్ టైమ్ మించిపోతోందని పద్ధతిగల మనుషులు ఎప్పుడూ పరుగులు తీయరు. సరిగ్గా సమయానికో, సమయం కన్నా ముందుగానో సిద్ధంగా ఉంటారు. సంస్థ నియమ నిబంధనలకు బద్ధులై ఉంటారు. వ్యక్తిగతంగా కూడా కొన్ని నియంత్రణలను ఏర్పరచుకుంటారు. ఇలాంటివారు వాయిదాలు అడగరు. వాదనలు పెట్టుకోరు. ఒక పని ఫలానా సమయానికి పూర్తవ్వాలని ఆదేశాలొస్తే, లేదా తమకై తాము అనుకుంటే ఆరు నూరైనా ఆ సమయానికి పని పూర్తి చేసేస్తారు. అది ఏ పనైనా, ఎంతటి పనైనా అంతే. ఉదా: ‘జన గణ మన’ గీతాన్ని పాడడం సరిగ్గా 52 సెకన్లలో పూర్తి చేయాలన్నది చట్టంలోని ఒక నియమం. ‘ఆ.. ఆలోపే పాడేస్తే ఏముందిలే, యాభై రెండు సెకన్లు దాటితే ఏమౌతుందిలే’ అని పద్ధతి, క్రమశిక్షణ ఉన్నవారు అనుకోరు. కచ్చితంగా యాభై రెండు సెకన్లకు జన గణ మన పూర్తయ్యేలా సాధన చేస్తారు. సాధన మానవ జీవితాన్ని లయబద్ధం చేస్తుంది. లక్ష్యాన్ని ఏర్పరచి ముందుకు నడిపిస్తుంది. దైవ సన్నిధికి మనసు చేర్చడానికి కూడా ఇదే విధమైన సాధన అవసరం. ‘జన గణ మన’ ప్రస్తావన ఎటూ వచ్చింది కనుక ఒక చిన్న విషయం. 1911లో ఇదే రోజు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో జన గణ మన గీతాన్ని తొలిసారిగా ఆలపించారు. రాసింది ఎవరో తెలుసు కదా. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్. ఆయన డిసెంబర్ 11న గీత రచన చేస్తే, డిసెంబర్ 27న ఆ రచన.. పాట రూపం దాల్చింది. -
‘జనగణమన’కు వంద రోజులు
జమ్మికుంట: దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసులు ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలిపించడం ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అయింది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంటవాసులు ప్రతిరోజు జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించడం ప్రారంభించారు. బుధవారానికి వందరోజులు కావడంతో జమ్మికుంటవాసులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జమ్మికుంటలో ప్రతిరోజూ ఉదయం 8 గం.లకు ఊరు మొత్తం స్పీకర్లలో జనగణమన వినిపిస్తుంది. జాతీయ గీతం వినపడగానే ఎక్కడి వారు అక్కడే తమ పనులను ఆపేసి, గీతం పూర్తయ్యే వరకు నిల్చొని సెల్యూట్ చేస్తారు. ఆగస్టు 15 నుంచి ఇలా ప్రతిరోజూ జాతీయ గీతాన్ని గౌరవించుకోవాలని ఆ పట్టణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పోలీసులు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో స్పీకర్లను ఏర్పాటు చేశారు. జాతీయ గీతం ప్రారంభమవడానికి ఐదు నిమిషాల ముందు ఒక ప్రకటన వస్తుంది. దాంతో ప్రజలంతా సిద్ధమవుతారు. తర్వాత జనగణమన వస్తున్న 52 సెకన్ల పాటు వారు నిల్చునే ఉంటారు. -
మహేష్‌తో అనుకున్నదే వెంకటేష్‌తో
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగంతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన పూరి, ప్రస్తుతం రోగ్ సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలతో గతంలోనే సినిమాలను ప్రకటించిన పూరి.. ఆ హీరోలు అందుబాటులో లేకపోవటంతో వెంకీతో సినిమా ప్లాన్ చేశాడు. మహేష్‌తో ప్రకటించిన జనగణమన సినిమానే వెంకటేష్ హీరోగా తెరకెక్కించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ తొలిసారిగా నిర్మాతగా మారుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు వెంకటేష్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
3 వేల గొంతుల జనగణమన
మార్మోగిన చంద్రంపాలెం స్కూలు ఘనంగా ఆంధ్ర కేసరి జయంతి మధురవాడ: విద్యార్థులు జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని ఆర్జేడీ వి.భార్గవ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘ఆజాద్–70’ పేరిట మంగళవారం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 వేల మంది విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ జాతీయ యోథులు ఎంతో మంది తమ ప్రాణాలు తణప్రాయంగా భావించి స్వాతంత్య్ర పోరాటం చేశారని, వారి త్యాగ నిరతి మరువ లేనిదని చెప్పారు. డీఈవో ఎంవీ కష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశ భక్తిని, సేవా తత్వాన్ని పెంపొందించు కోవాలని చెప్పారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయాలని చెప్పారు. మహనీయుడు ప్రకాశం రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతిని పురస్కరించుకుని చంద్రంపాలెం పాఠశాలలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసిన నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన యోథుడు ప్రకాశమని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రాజబాబు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఈ బంధం అనిర్వచనీయమైంది
-
రష్యా నమ్మకమైన నేస్తం!
-
ఈ బంధం అనిర్వచనీయమైంది
మాస్కో: రష్యాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. రష్యా ఎక్స్పో సెంటర్లో 3000మంది ప్రవాసభారతీయులు పాల్గొన్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యన్లు భారత్‌పై చూపిస్తున్న మమకారానికి సగటు భారతీయ హృదయం ఉప్పొంగుతుందన్నారు. భారత్ రష్యాల బంధం అనిర్వచనీయమైందన్నారు. ముందుగా నమస్తే అంటూ ప్రవాస భారతీయులను సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రష్యా ప్రముఖ పాప్ సింగర్ సాటి కఝనోవా వేద మంత్రాలను ఉచ్ఛరించటం విశేషం. చూస్తూ చదవకుండా.. మంత్రాలను స్పష్టంగా ఉచ్ఛరింటం ఆనందం కలిగించిందని.. అది ఆమె చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, మాజీ ప్రధాని వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన రాసిన ‘మై గీత్ నయా గాతా హూ’ పాటపై రష్యా కళాకారులు ప్రదర్శన, గుజారాతీ నృత్యం గార్బాపై డాన్సులపై సంతోషం వ్యక్తం చేశారు. రష్యన్ల నుంచి గార్బా నేర్చుకుంటామన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. * భారత్-రష్యా మధ్య బంధం చాలా పాతది. కానీ రష్యన్లు భారత సంస్కృతిని నేర్చుకోవటం గొప్పవిషయం. * రష్యాకు చెందిన ఓ మహిళ తను యోగాపై రాసిన పుస్తకాన్ని నాకు కానుకగా ఇచ్చారు. రష్యాలో 400 ఏళ్లనాటి భారతదేశ పద్ధతిలో కట్టిన ఇంటిని చూశాను ఆనందం వేసింది. * రష్యాపై సంస్కృత భాష ప్రభావం చాలా ఉంది. అష్ట్రాఖాన్ ప్రాంత గవర్నర్‌తో మాట్లాడాను. ఆయనకు వాటర్ మిలన్ కంటే.. తర్బూజ్ అంటేనే అర్థమైంది. మొదట్నుంచీ భారత్‌కు వెన్నంటి నిలిచిన దేశం రష్యా. * రష్యన్లు ఎక్కువగా పర్యాటకాన్ని ఇష్టపడతారు. అందుకే ఏడాదికి కనీసం ఐదు రష్యన్ల కుటుంబాలైనా భారత్‌లో పర్యటించాలని కోరుతున్నాను. * 21వ శతాబ్దం ఆసియా ఖండానిదే. అందులోనూ భారతదేశమే పరిస్థితులను ముందుండి నడిపిస్తుంది. * దేశంలో 35 ఏళ్ల లోపున్న వారు 80కోట్ల మంది ఉన్నారు. వారే ప్రస్తుతం భారతదేశపు శక్తి. మేం నవభారత నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. రైల్వేల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు దారులు తెరిచాం. * ఉగ్రవాదంతో ప్రపంచ మానవాళికి ముప్పుందని 30 ఏళ్లుగా చెబుతున్నాం. అప్పుడు ఎవరూ వినలేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాద ప్రభావాన్ని అనుభవిస్తోంది. భారత్‌లో కొందరు ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. మేం వాటికి పరిష్కారం సూచించాం. -
రష్యా నమ్మకమైన నేస్తం!
మాస్కో: మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో కమోవ్-226 యుద్ధ హెలికాప్టర్ల తయారీకి రష్యా పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా 12 అణువిద్యుదుత్పత్తికి రియాక్టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన సందర్భంగా జరిగిన ఇండో-రష్యా శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య బంధం బలపడే దిశగా మొత్తం 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని రక్షణ, అణుశక్తితోపాటు ఆర్థిక రంగంలోనూ పరస్పరం సహకారం చేసుకోవాలని నిర్ణయించారు. మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన ఈ సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇరుదేశాలకు చెందిన పలువురు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించటంపై తమ పూర్తి మద్దతుంటుందని ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని సంయుక్త మీడియా సమావేశంలో మోదీ పేర్కొన్నారు. రష్యాలో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో భారత కంపెనీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా పుతిన్ అంగీకరించారు. ప్రస్తుతం పది బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుండగా.. వచ్చే పదేళ్లలో దీన్ని 30 బిలియన్ డాలర్లకు (రూ.1.98 లక్షల కోట్లు) పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న రష్యా.. ఆర్థికంగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. భారత్‌తో రక్షణ, ఆర్థిక సహకారంపైనా చర్చలు జరిపారు. అటు భారత్ కూడా ‘యురేషియా’ ఆర్థిక జోన్ పరిధిలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం పట్టుబడుతోంది. గతవారం భారత రక్షణ శాఖ రష్యానుంచి రూ.40 వేల కోట్లతో ‘ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ’ను కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, సమావేశం జరిగిన తీరుపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య అభివృద్ధితోపాటు అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక, మానవీయ విషయాల్లో మరింత బలమైన బంధాలకు సదస్సు దోహద పడుతుందని సంయుక్త ప్రకటనలో ఇరువురు నేతలు తెలిపారు. తమ భేటీ ఫలప్రదంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. మంచిరోజుల్లో, చెడ్డ రోజుల్లో రష్యా భారత్‌కు నమ్మకమైన నేస్తంగా ఉన్నదని మోదీ అన్నారు. రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాలతో.. భారత తయారీ రంగం మరింత వేగం అందుకుంటుందన్నారు. అంతకుముందు క్రెమ్లిన్‌లోని అలెగ్జాండర్ గార్డెన్లో ఉన్న రెండో ప్రపంచయుద్ధ అమరవీరులకు పుష్పాంజలి అర్పించారు. తర్వాత రష్యా ప్రభుత్వం ఆధీనంలో నడిచే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్సీఎంసీ)ని ప్రధాని మోదీ గురువారం సందర్శించారు. అరగంటసేపు ఈ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి సిబ్బందితో వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పుతిన్.. ఆయన ఇచ్చిన విందును స్వీకరించారు. మోదీతో భేటీ సందర్భంగా బెంగాల్‌కు చెందిన 18వ శతాబ్దం నాటి ఖడ్గం, మహాత్మాగాంధీ డైరీలోని ఓ పేజీ (చేతిరాత)ని పుతిన్ మోదీకి బహూకరించారు. భారత విదేశాంగ నీతి బాధ్యతాయుతమైనదన్న నితిన్.. ప్రపంచం ఎదుర్కుంటున్న చాలా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించే స్థానంలో భారత్‌ను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. సిరియాలో జరిగిన రష్యా విమాన ప్రమాద మృతులకు మోదీ సంతాపం తెలిపారు. కాగా, రష్యా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు బయల్దేరారు. శుక్రవారం ఉదయం చేరుకోనున్నారు. రష్యాతో కుదుర్చుకున్న 16 ఒప్పందాలు * పౌరుల విమాన ప్రయాణాల విషయం లో పరస్పరం నిబంధనల సరళీకరణ. * అధికారులు, దౌత్యవేత్తల పాస్‌పోర్టులున్న వారికి ఇరుదేశాల్లో పరస్పరం ప్రయాణించే సౌకర్యం. * హెలికాప్టర్ ఇంజనీరింగ్‌రంగంలో సహకారం. * 2015-17 మధ్య కస్టమ్స్ ఎగవేత నియంత్రణలో సహకారం. * భారత్‌లో 12 రష్యా తయారీ అణురియాక్టర్ల ఏర్పాటు (ఏపీతో సహా). * రైల్వే రంగంలో సాంకేతిక సహకారం. * భారత్‌లో సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణంలో సహకారం. * రాంచీలోని హెచ్ఈసీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెవీ ఇంజనీరింగ్ అభివృద్ధికి ఒప్పందం. * హెచ్ఈసీ తయారీ సామర్థ్యాన్ని పెంచ టం, నూతనీకరించేందుకు ఒప్పందం * ప్రసార రంగంలో సహకారం. * సీ-డాక్, ఐఐఎస్సీ (బెంగళూరు), లోమొనోసోవ్ మాస్కో స్టేట్ వర్సిటీ మధ్య ఒప్పందం. * సీ-డాక్, ఓజేఎస్‌సీ, గ్లోనాస్ యూనియన్ మధ్య ఒప్పందం. * రష్యాలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులకు సహకారం. * హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి (రష్యా భూభాగంపై) ఒప్పందం. * జేఎస్సీ వాంకోర్‌నెఫ్ట్‌లో సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులో తొలివిడత పనులు పూర్తయినట్లు ధృవీకరణ. * హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి(భారత భూభాగంపై) ఒప్పందం. -
ఈ పొరపాటేమిటి నరేంద్ర మోదీజీ?
మాస్కో: రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అక్కడ స్వాగత కార్యక్రమంలో తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేశారు. రష్యా బ్యాండ్ భారత జాతీయ గీతమైన ‘జన గణ మన అధినాయక జయహే’ను ఆలపిస్తుండగా రెడ్ కార్పెట్‌పై ముందుకు నడిచారు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ అధికారి వెంటనే మోదీ ముందుకువెళ్లి ఆయన్ని అంతకుముందున్న చోటుకు తీసుకెళ్లి నిలబెట్టారు. గీతాలాపన అనంతరం మోది మళ్లీ ముందుకు కదిలారు. మోదీని ఆహ్వానించేందుకు వచ్చిన రష్యా ప్రభుత్వ ప్రతినిధి, మోదీ రాగానే భారత జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా రష్యా అధికార బ్యాండ్‌ను ఉద్దేశించి చేయి ముందుకు సాచారు. ఆ సైగను పొరపాటుగా అర్థం చేసుకున్న మోదీ, తనను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నారని భావించి భారత జాతీయ గీతాలాపన కొనసాగుతుండగానే ముందుకు నడిచారు. ఈ సంఘటనను ఎవరు ఎలా అర్థం చేసుకున్నప్పటికీ పార్టీకన్నా దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ముద్రపడిన మోదీ ఇలా చేయడమేమిటని ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘జన గణ మన అధినాయక జయహే....జాతీయ గీతాన్ని దేశానికి ఆపాదించిందీ కాంగ్రెస్ పార్టీ, అలాంటప్పుడు బీజేపీ పార్టీకి చెందిన మోదీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు....మొన్న జాతీయ జెండాను అవమానించారు. నేడు జాతీయ గీతాన్ని అవమానించారు. విదేశీ పర్యటనల్లో ఎప్పుడూ కెమేరాలపైనే కాకుండా ఇలాంటి విషయాలపై కూడా దృష్టి పెట్టండీ మోదీ గారు....మోదీ పచార్లు చేస్తున్నప్పుడు జాతీయ గీతాలాపన ఆపవద్దా?....మోదీనే జాతీయ గీతం అవమానించిందీ, ఆయన నడిచేందుకు పాస్ ఇవ్వాలిగదా!.....ముంబై సినిమా థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడనందుకు ఓ జంటను బయటకు తరిమేసిన దేశభక్తులారా! ఇప్పుడేమంటారు?...’ లాంటి విమర్శలు ట్విట్టర్లో చెక్కర్లు కొడుతున్నాయి. విదేశీ పర్యటనల సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఇలాంటి పొరపొట్లు చేయకపోలేదు. మోదీకి కూడా ఇది కొత్తేమి కాదు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు భారత జాతీయ జెండాపై ఆయన తన సంతకం చేశారు. సంతకం చేయడం కూడా జాతీయ జెండాను అవమానపర్చడమే. అంతెందుకు గత నెలలో మోదీ, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేను కలసుకున్నప్పుడు వారి వెనకాల భారత జాతీయ జెండా తలకిందులుగా అమర్చి ఉంది. అప్పుడు కూడా విమర్శలు రాగా అది ప్రొటోకాల్ ఆఫీసర్ తప్పిదమని, చర్యలు తీసుకుంటామని పీఎంవో వర్గాలు తెలిపాయి.