Puri Jagannadh Jana Gana Mana Will Be Made As A Pan India Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Jana Gana Mana: మహేశ్‌తో కాదు.. ఆ బాలీవుడ్‌ హీరోతో ‘జనగణమన’!

Published Thu, Jan 27 2022 1:55 PM | Last Updated on Thu, Jan 27 2022 2:21 PM

Puri Jagannadh Jana Gana Mana Will Be Made As A Pan India Movie - Sakshi

ప్రతీ దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. పెద్ద కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడం అనేది ప్రతీ డ్రీమ్ మేకర్ కు ఉంటుంది. కాకపోతే అందుకు సరైన సమయం కావాలి.ఇప్పుడు పూరి జగన్నాథ్ కు అలాంటి సమయమే వచ్చింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఇదే సరైన సమయం అని డాషింగ్ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్ అనుకుంటున్నారు. పూరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఏంటో అందరికి తెలిసిందే. ఎప్పటికైనా ‘జనగణమన’మూవీని తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నాడు.

బిజినెస్ మెన్ తర్వాత మహేశ్‌ బాబుతో పూరి చేయాల్సిన చిత్రమిది. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత వీరిద్దరు ఈ సినిమాపై డిస్కస్ కూడా చేశారు. కానీ  ప్రిన్స్ వైపు నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించకపోవడంతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను  పక్కనపెట్టాడు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అందుకే జనగణమన వైపు పూరి మళ్లీ దృష్టి పెట్టాడట. లైగర్ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ లాంటి మహామహులతో పాన్‌ ఇండియా లెవల్లో జనగణమన ప్లాన్ చేస్తున్నాడట పూరి.

ఇక లైగర్‌ విషయానికొస్తే.. . విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌.. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్‌తో ఆగిపోయింది.  ఈ ఏడాది ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తర్వాత దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement