Actress Pooja Hegde Upcoming Movies Updates Details In Telugu - Sakshi
Sakshi News home page

Pooja Hegde Upcoming Movies: వరుస ఫ్లాప్స్‌.. తగ్గని క్రేజ్‌..దూసుకెళ్తున్న పూజా హెగ్డే

Published Sat, Jul 9 2022 1:03 PM | Last Updated on Sat, Jul 9 2022 3:38 PM

Pooja Hegde Upcoming Movies Updates - Sakshi

ఈ ఏడాది స్టార్టింగ్‌ నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస షాక్స్‌ ఎదురవుతున్నాయి.ఆమె కనిపించిన ప్రతి సినిమా బాక్సఫీస్ దగ్గర బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ వెళ్లి చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. అన్ని కూడా పూజా స్పీడ్ కు సడన్ బ్రేక్స్ వేసిన సినిమాలే.కెరీర్ బిగినింగ్ లోనూ ఇలాంటి ఫేజ్ ను చూసింది పూజ.

అయితే అప్పుడు తన కెరీర్ గురించి భయపడింది. కాని ఇప్పుడు తగ్గేదేలేదు అంటోంది బుట్టబొమ్మ. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తన కెరీర్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏం లేదనే ధైర్యంతో పూజా దూసుకెళ్తోంది. 

ప్రస్తుతం పూజ పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో బిగ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటోంది. అందుకే చాలా అంటే చాలా బిజీగా పరులుగు తీస్తోంది.బాలీవుడ్ లో సర్కస్, కభీ ఈద్ కభీ దివాళి, టాలీవుడ్ లో పూరి డైరెక్ట్ చేస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ జనగణమన, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రంలో నటించనుంది.శాండల్ వుడ్ లో కేజీయఫ్ 2 తర్వాత రాఖీభాయ్ నటించే నెక్ట్స్ ప్రాజెక్ట్ లోనూ, కోలీవుడ్ లో సూర్యతో కొత్త సినిమాలోనూ కనిపించబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement