
నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala).. కొంతకాలంపాటు దాగుడుమూతలు ఆడారు. డేటింగ్ గురించి ప్రశ్నలొస్తే.. ప్రేమాగీమా ఏదీ లేదనేది శోభిత. చై అయితే అసలు స్పందించేవాడే కాదు. మీరు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నట్లుగా అక్కినేని అభిమానులు ఈ జంట గాఢమైన ప్రేమలో ఉందని తేల్చేశారు. అది నిజమేనంటూ 2024 డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.
అతడిపై మనసు పారేసుకున్న శోభిత
అప్పటికే నాగచైతన్య.. గతంలో సమంతను ప్రేమించి పెళ్లిచేసుకోగా ఆమెకు విడాకులిచ్చేశాడు. శోభితకు మాత్రం ఇదే తొలి వివాహం. అయితే చై కంటే ముందు ఆమె వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న విషయం మీకు తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్‌లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వెధవ నన్నసలు పట్టించుకునేవాడే కాదు.

అతడి గురించే ప్రత్యేకంగా..
అతడి ప్రవర్తన చూసి నాకు బాధేసేది. అప్పుడు వ్యాసరచన వంటి కొన్ని అంశాల్లో ఎక్కువ ఫోకస్ చేశాను. అందులో టాప్ వస్తేనైనా నన్ను చూస్తాడేమోనని! కానీ అలా ప్రయత్నించే క్రమంలో నేను చాలా మారిపోయాను. అతడి గురించి పట్టించుకోవడం మానేశాను. కొంచెం పరిపక్వత చెందాను.
సినిమా..
కాలేజీలో నాకు లవ్ ప్రపోజల్స్ వచ్చేవి. నేను కూడా కొన్ని లెటర్స్ రాశాను. అయితే అబ్బాయిల విషయంలో నా టేస్ట్ అస్సలు బాగుండేది కాదు అని పేర్కొంది. గూఢచారి, మేజర్, కల్కి 2898 ఏడీ సినిమాలతో తెలుగులో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తోంది.
చదవండి: సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment