సాక్షి, హైదరాబాద్ : యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవి రూ. 500ల ఫైన్ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో చోటుచేసుకుంది. కాగా, భారత్‌లో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, ఇటీవల నాగశౌర్య ఓ బేబీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. వైజాగ్‌లో జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డ సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment