
Hyderabad Traffic Police Fined To Manchu Manoj Car: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కారుకు బ్లాక్ ఫిలిం ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనోజ్ కారుకు రూ. 700 ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే మనోజ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
చదవండి: అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లను అడ్డుకున్న పోలీసులు
ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు పోలీసులు. ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తెర ఉన్నందున మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ. 700 జరిమానా విధించారు. అనంతరం ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కారులకు సైతం బ్లాక్ ఫిలిం తెరను తొలగించి చలానా విధించారు.
చదవండి: స్టార్ హీరో కారును అడ్డుకున్న పోలీసులు, ఏం జరిగిందంటే?