
నన్ను ఎంతోమంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరు అంటున్నాడు హీరో మంచు మనోజ్ (Manchu Manoj). తనను తొక్కాలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్లే అవుతుందన్నాడు. భరత్ హీరోగా పరిచయమవుతున్న జగన్నాథ్ సినిమా టీజర్‌ను మంచు మనోజ్ గురువారం రిలీజ్ చేశాడు.
నన్ను తొక్కాలని చూసినా..
అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో జరిగిన ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా.. ఆ నాలుగు గోడల మధ్యకు నన్ను రానీయకపోయినా, నన్ను ఏం చేసినా సరే.. ప్రజల గుండెల్లో నుంచి మాత్రం నన్ను తీయలేరు. మీరే నా దేవుళ్లు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్నీ..!
ఎవరి వల్లా సాధ్యం కాదు
చెట్టుపేరో, జాతి పేరో చెప్పుకుని మార్కెట్‌లో అమ్ముడుపోవడానికి నేను కాయో, పండో కాదు.. మీ మనోజ్‌ను. మనోజ్‌ను తొక్కుదామని చూస్తారా? నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్ల మాత్రమే అవుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెవరి వల్లా కాదు.
ఎంతదూరమైనా వెళ్తా..
ఓ మంచి కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగేవరకు దాన్ని వదిలిపెట్టేది లేదు. అది బయటవాళ్లైనా సరే, నా వాళ్లయినా సరే.. న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తాను. నేను విద్యార్థుల కోసం నిలబడ్డాను. నా ప్రాణం ఉన్నంతవరకు నిబలడతాను. ఈ రోజే కాదు, ఎప్పటికీ ఎవరూ నన్ను ఆపలేరు అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment