chalana
-
ఫ్రెండ్ కారులో వీకెండ్ ట్రిప్‌కు చెక్కేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
వీకెండ్‌లోనో, లేదా అత్యవసరం అనుకున్నపుడో ఫ్రెండ్కారును తీసుకొని వెళ్లడం చాలామందికి అలవాటు. అలాగే అద్దె కారులో అయినా సరే హిల్ స్టేషన్లకు చెక్కేస్తారు చాలామంది. అయితే అలాంటి వారి గుండ గుభిల్లు మనే వార్త ఇది. స్రేహితుడి కారులో రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఒక ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫ్రెండ్ కారు తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన టూరిస్ట్‌లకు భారీ పెనాల్టి విధించారు అక్కడి పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను సీతారామ్ 12456 తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. దీని ప్రకారం అక్కడి ట్రాఫిక్ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఆపారు. చిన్న వీడియోలో కుటుంబం ప్రయాణిస్తున్న కారు కనిపించలేదు. కానీ వీడియోలోని వ్యక్తి తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అతను చూపించిన పత్రాలను చూసిన పోలీసులు మరొకరి కారును ఉపయోగించడనాఇకి అనుమతిలేదని చలాన్ జారీ చేస్తామని డ్రైవర్‌కు చెప్పడం, దీంతో ఇరువురూ కాసేపు వాదించు కోవడం చూడొచ్చు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న పోలీసులు అసలు కారు ఓనరుకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నారు. చివరికి చలానా విధించారు. (ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు) అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటంటే స్నేహితుడు లేదా బంధువు కారును వారి సమ్మతితో తీసుకు వెళ్లడం, నడపడం నిజానికి చట్టవిరుద్ధం కాదు. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది టూర్ ఆపరేటర్లు కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ఆదా చేసేందుకు పర్యాటకులకు ప్రైవేట్ రిజిస్టర్డ్ కార్లను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలా వ్యవహరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు యజమాని నుండి సమ్మతితో కారును తీసుకున్నట్లయితే, అది చట్టవిరుద్ధం కాదు. ఒకవేళ పోలీసులు తప్పుగా చలాన్ జారీ చేస్తే, ఈ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే చెన్నైలో యజమానికి తెలియకుండా స్నేహితుడి లేదా బంధువుల వాహనం నడుపుతూ పట్టుబడితే, చెన్నై పోలీసులు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. సాధారణ తనిఖీల సమయంలో కారు లేదా బైక్ తమ స్నేహితుడిదేనని చాలా మంది పేర్కొంటున్నందున, నగరంలో వాహనాల దొంగతనాల సంఖ్యను తగ్గించేలా ఇలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) -
డైరెక్టర్ త్రివిక్రమ్ కారుకు జరిమానా
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్ కారును అడ్డుకున్నారు. ఆయన కారును తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలింను గుర్తించారు. దీంతో కారుకు ఫైన్ వేసి బ్లాక్ ఫిలింను తొలగించారు. ఆనంతరం ఆయనకు రూ. 700 జరిమానా విధించారు. చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్‌లకు కూడా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి బ్లాక్ ఫిలిం తొలగించిన సంగతి తెలిసిందే. -
ట్రాఫిక్ ఈ చలాన్స్.. పేటీఎం ద్వారా రూ. 60 కోట్లు వసూళ్లు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన పెండిగ్ చలాన్ల క్లియరెన్స్ మంచి స్పందన వస్తోంది. 75 శాతం పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చంటూ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. 2022 మార్చి 1 నుంచి 31 వరకు ఈ ఆఫర్ కొనసాగుతోంది. కాగా ట్రాఫిక్ చలాన్లలో డిజిటల్ పేమెంట్ పార్టనర్‌గా ఉన్న పేటీఎం ద్వారా రూ. 60 కోట్లు వసూలు అయినట్టు ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై, ఫరీదాబాద్, మహారాష్ట్రలతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ఈచలాన్ ట్రాఫిక్ జరిమానా చెల్లింపు సేవల్లో పేటీఎం పార్ట్నర్గా ఉంది. పెండింగ్ చలాన్లను ట్రాఫిక్ పోలీసు విభాగం వెబ్‌సైట్‌తో పాటు పేటీఎం యాప్, వెబ్సైట్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు. 2022 మార్చి 31తో గడువు ముగియనుంది. చదవండి: చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన.. -
హీరో మంచు మనోజ్ కారుకు జరిమానా.. ఎందుకంటే?
Hyderabad Traffic Police Fined To Manchu Manoj Car: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కారుకు బ్లాక్ ఫిలిం ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనోజ్ కారుకు రూ. 700 ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే మనోజ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు పోలీసులు. ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తెర ఉన్నందున మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ. 700 జరిమానా విధించారు. అనంతరం ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కారులకు సైతం బ్లాక్ ఫిలిం తెరను తొలగించి చలానా విధించారు. చదవండి: స్టార్ హీరో కారును అడ్డుకున్న పోలీసులు, ఏం జరిగిందంటే? -
ఫేక్ చలానాలకు శాశ్వతంగా ఫుల్స్టాప్
-
వైరల్: యువతుల బైక్ స్టంట్.. రూ.28 వేలు ఫైన్
లక్నో: ఏ పని చేసినా వీడియో తీసుకోవటం దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటం యువతకు సరదాగా మారిపోయింది. తాను చేసిన వీడియో వల్ల ఆ యువతికి ఫైన్ పడింది. సరదాగా చేసిన బైక్ స్టంట్ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించిన సదరు యువతికి పోలీసులు రూ.28 వేల ఫైన్ వేశారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శివంగి దబాస్, రెజ్లర్ స్నేహ రఘువంషి ఇద్దరు స్నేహితులు. అయితే శనివారం ఘజియాబాద్ రోడ్డుపై స్నేహి రఘువంషి తన స్నేహితురాలు శివంగి దబాస్‌ను భుజాలపై కూర్చుబెట్టుకొని బైక్‌ను నడిపింది. ఈ బైక్ స్టంట్‌కు సంబంధించిన వీడియోను రఘువంషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల కంటపడటంతో రఘువంషి తల్లి మంజూ దేవికి రూ.11వేల చలానా పంపారు. అదే విధంగా ఆ బైక్ యజమాని అయిన సంజయ్ కుమార్‌కు రూ.17వేల ఫైన్ వేశారు. ఈ ఇద్దరు యువతలకు డ్రైవింగ్ లైసన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా రోడ్డుపై స్టంట్ చేసినందుకు చలానా పంపి, ఫైన్ వేశామని ఘజియాబాద్ ట్రాఫిక్ ఎస్పీ రామానంద్ కుష్వాహా తెలిపారు. వాళ్లు నడిపిన బైక్‌కు నంబర్ ప్లేట్ కూడా లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీనిపై రఘువంషి మాట్లాడుతూ.. తాము స్టంట్ ప్రాక్టిస్ చేయటం కోసం జనాలు ఎక్కువ లేని రోడ్డును ఎంచుకున్నాం. కేవలం సరదాగా ఆ వీడియో తీశామని, ఆ వీడియో ఇంత పెద్ద వివాదంగా మారుతుందని ఊహించలేదని తెలిపారు. చదవండి: వైరల్: హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా! -
ఇదేం బాదుడు..ఫేస్బుక్ స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం-2019 జనాలను బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ నూతన చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చట్టం పేరు చెప్పి సామాన్యుల జేబు గుల్ల చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోవడం లేదని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టం పేరు చెప్పి.. అధికారులు వాహనదారులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలిపే సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. రాఘవ్ స్వాతి పృథి అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. రాఘవ్ స్వాతి పృథి కొద్ది రోజుల క్రితమే హార్లీ డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ బైక్‌ని కొన్నాడు. ఈ బండి ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గానే వస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గురించి అతడి మాటల్లోనే.. ‘తిలక్ నగర్లో నేను నా బైక్‌పై తిరుగుతుండగా.. నా ఎదురుగా ఓ పోలీసు వాహనం వచ్చింది. అందులోంచి ఓ అధికారి దిగి నా బండిని ఆపమని చెప్పాడు. ఆ తర్వాత బండికి సంబంధించిన అన్ని పేపర్లు తీసుకుని నన్ను పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. బాధ్యత గల పౌరుడిగా నేను వారు చెప్పినట్లే చేశాను. పోలీస్ స్టేషన్‌లోనికి వెళ్లాక అధికారులు ఉన్నట్లుండి నా మీద అరవడం ప్రారంభించారు. బైక్‌లో లౌడ్ స్పీకర్లు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నావా అని ప్రశ్నిచారు. దాంతో నేను బైక్‌లో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గా ఉంది. నేనేం మార్పులు చేయలేదు. ఇది బుల్లెట్ కాదు అని వివరించే ప్రయత్నం చేశాను. కానీ ఆ అధికారులు నా మాటలు పట్టించుకోలేదు. ఇది ఇల్లీగల్ బైక్.. దీన్ని నడపాలంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను హార్లీ ఇండియా వెబ్సైట్లో బైక్‌కు సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం చేశాను. కానీ అది కూడా ఫలించలేదు. నన్ను చలానా కట్టాల్సిందిగా ఆదేశించారు’అన్నాడు. ‘ఇంతలో ఓ ట్రాఫిక్ అధికారి అక్కడకు వచ్చి సర్ ఈ బైక్‌కు అనుమతులున్నాయి. ఇది ఇల్లీగల్ కాదని నచ్చజేప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ అధికారులు అతడి మాట కూడా వినలేదు. చలానా కట్టాల్సిందే అన్నారు. నేను బండికి సంబంధించిన ప్రతి కాగితాన్ని వారికి చూపించాను. చలానా ఎందుకు కట్టాలని ప్రశ్నించాను. అందుకు వారు బైక్‌లో మ్యూజిక్ ప్లే చేసినందుకు అన్నారు. పోలీసులు నా బండి ఆపినప్పుడు నా బైక్‌లో నుంచి వస్తోన్న మ్యూజిక్ సౌండ్ కేవలం 30 శాతం మాత్రమే. దాంతో నేను బండిలో పెద్దగా మ్యూజిక్ ప్లే చేసి ఎవరికి ఇబ్బంది కలిగించలేదని స్పష్టం చేశాను. అప్పుడు అధికారులు నా బైక్ సౌండ్ పూర్తిగా పెంచి వీడియో తీసి ఇప్పుడు చలానా కట్టు అని ఆదేశించారు. నా బైక్‌కు సంబంధించి అన్ని పన్నులు చెల్లించాను. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ వారి నిబంధనల మేరకు అన్ని కాగితాలను చూపించడమే కాక.. అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించాను. అయినా పోలీసులు నన్ను చలానా కట్టాలని ఆదేశించారు’ అంటూ వాపోయాడు రాఘవ్. ‘నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా.. మీరే చెప్పండి. ఏ నేరం చేయని నన్ను రెండు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టి.. అమర్యాదగా ప్రవిర్తంచారు. ఇదెక్కడి న్యాయం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్న అంటే.. ఈ రోజు నాకు జరిగింది.. రేపు మీకు జరగవచ్చు. మనం ఒకిరికొకరం మద్దతిచ్చుకుని.. ఈ అన్యాయాన్ని ఎదిరించాల’ని చెప్పుకొచ్చాడు రాఘవ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫేస్బుక్లో తెగ వైరలవుతోంది. భారీ సంఖ్యలో నెటిజనులు రాఘవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరి దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో పాటు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
పోలీసుల ‘పోస్టర్’ వర్సెస్ గ్రేటర్ ‘చలాన్’
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ కమిషనర్ వినియోగించే వాహనం పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.6,210 జరిమానా విధించారు. బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ గోల్కొండ ప్రాంతంలోని ప్రభుత్వ గోడలపై పోస్టర్లు అంటించిన పోలీసులకు ‘గ్రేటర్’ రూ.10 వేల ఫైన్ వేసింది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండూ వ్యవహారాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉన్నాయని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. జరిమానా విధించడంలో జీహెచ్ఎంసీ వ్యవహారశైలి కూడా ‘నిబంధనల్ని ఉల్లంఘిచినట్లే’ ఉందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వినియోగించే వాహనం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిఘా కెమెరాలకు చిక్కింది. దీంతో గత ఏడాది ఆగస్టు 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 మధ్య ఆరు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన జరిమానా మొత్తం రూ.6,210 పెండింగ్‌లో ఉన్నట్లు గత గురువారం మొహిత్ పటేల్ అనే నెటిజనుడు ట్వీట్ చేశాడు. ఇది సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జీహెచ్ఎంసీ స్పందించింది. కమిషనర్ దాన కిషోర్ వినియోగించే కారుపై (టీఎస్ 09 ఎఫ్ఏ 4248) ఉన్న ఆరు చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది.ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాన్ని నడిపిన డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారనీ ప్రకటించింది. ఇది జరిగిన వారం రోజులకు జీహెచ్ఎంసీ అధికారులు తమ ‘కక్ష’ తీర్చుకున్నారు. తమకు రూ.6210 జరిమానా విధించిన పోలీసులకు రూ.10 వేల ఫైన్ వేశారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసు విభాగం ఆ భక్తులకు స్వాగతం పలకాలని భావించింది. దీనికోసం రాష్ట్ర డీజీపీ నుంచి స్థానిక గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ వరకు ఆరుగురి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు. గోల్కొండ పోలీసుస్టేషన్ పేరుతో ముద్రించిన వీటి ద్వారా బోనాలకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ అనేకచోట్ల అతికించారు. వీటిని చూసిన జీహెచ్ఎంసీ అధికారులు..సదరు పోస్టర్లు తమ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటయ్యాయంటూ గురువారం రూ.10 వేల చలాన్ జారీ చేశారు. ప్రభుత్వ విభాగమైన పోలీసు శాఖ ఇలాంటి అతిక్రమణలకు పాల్పడకూడదని జీహెచ్ఎంసీ అధికారులు అంటుండగా... ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, సదరు పోస్టర్ అంటించిన గోడ జీహెచ్ఎంసీకి చెందిన కాదని పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులో, వాణిజ్య అవసరాల కోసమే ఇలా చేస్తే జరిమానా విధించాలి తప్ప ప్రభుత్వం విభాగం, ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అంటిస్తే ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు. సదరు గోడపై పోస్టర్ అతికించి పోలీసు విభాగం తప్పు చేస్తే... దానిపై తీసుకున్న చర్య ద్వారా జీహెచ్ఎంసీ కూడా తప్పు చేసిందని అధికారులు అంటున్నారు. ఆ పోస్టర్లు గోల్కొండ పోలీసులు ముద్రించినట్లు వాటిని చూస్తేనే అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీ చెబుతున్నట్లు అవి నిబంధనలకు విరుద్ధమైతే నేరుగా ఠాణాకు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్కు చలాన్ అందించవచ్చని, అయితే అలా చేయని జీహెచ్ఎంసీ అధికారులు ఆ పోస్టర్ పక్కనే చలాన్ అతికించారని చెబుతున్నారు. పోలీసులు పోస్టర్ అతికించడం తప్పయితే... చలాన్ అతికించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఈ–చలాన్ల జారీ మొత్తం సాంకేతికంగా వాహనం నెంబర్ ఆధారంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా సదరు వాహనం ఎవరిది అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలిసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ వాడుతున్న వాహనంపై ఈ–చలాన్లు ఉన్న విషయం ఓ నెటిజనుడు ట్వీట్ చేయడంతో బయటకు వచ్చిందని, దీనికి సంబంధించి పోలీసులపై జీహెచ్ఎంసీ ‘కక్ష’ కట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. -
జనవరి 31లోగా చెల్లించాలి
సాక్షి హైదరాబాద్: హజ్ యాత్ర–2018కు ఎంపికైన వారు ప్రయాణానికయ్యే ఖర్చులో తొలి వాయిదా రూ. 81 వేలను ఈ నెలాఖరులోగా చెల్లించాలని హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎ.షుకూర్ శుక్రవారం తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఏశాఖ నుంచి అయినా కేంద్ర హజ్ కమిటీ పేరుతో చలానా తీయవచ్చన్నారు. రుసుమును ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చన్నారు. హజ్ కమిటీ కేటాయించిన నంబర్, బ్యాంక్ నిర్థారణ, పాన్‌కార్డు నంబర్లను చలానా తీసేటప్పుడు పేర్కొనాలని చెప్పారు. నగదు రసీదుతో పాటు డ్రా ద్వారా ఎంపికైన వారు తమ ఒరిజినల్ పాస్‌పోర్టు, ఫొటోలు, మెడికల్ సర్టిఫికెట్‌ను రాష్ట్ర హజ్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. -
గీత దాటారు.. కోట్లు కట్టారు
-
వాహనచోదకులరా తస్మత్ జాగ్రత్త
-రాంగ్రూట్లో వెళ్లినా..సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఈ చలానా జరిమాన - త్వరలో కర్నూలులో అమలు – సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు : నిబంధనలకు విరుద్ధంగా రాంగ్రూట్లో వెళ్లే వాహన చోదకులకు ఈ చలానా జరిమానతో చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు కార్యచరణ రూపొందించారు. త్వరలో ఈ చలాన ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నగరంలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్ పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమును ఆయన పరిశీలించారు. నగరంలోని రద్దీస్థలాలు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను కంట్రోల్ రూము నుంచి పరిశీలించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, పరిమితికి మించి వాహనాల్లో వెళ్లడం వంటి వాటిని సీసీ కెమెరాల నుంచి ఫొటో క్యాప్షర్ చేసి, ఈచలానా ఫాం వాహనదారుని ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ఈచలానా జరిమాన రూ.300 నుంచి రూ.1000 వరకు ఉంటుందన్నారు. దూర ప్రాంతాల వారికి పోస్టల్లో ఈ చలానా వెళ్తుందన్నారు. శివారు కాలనీల్లో కూడా ప్రజాభద్రతా చట్టం ప్రకారం సీసీ కెమెరాల వినియోగానికి అవగాహన కల్పిస్తామన్నారు. ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల పుటేజీ నుంచి పర్యవేక్షించాలన్నారు. సీసీ కెమెరాల పనిలోపం ఎక్కడైనా ఉంటే మున్సిపల్ అధికారులు బృహస్పతి టెక్నాలజీ వారితో చర్చించి సరిచేయాలన్నారు. నేరాల అదుపునకు, దర్యాప్తునకు సీసీ టీవీల పుటేజీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబూప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, కృష్ణయ్య, నాగరాజరావు, నాగరాజుయాదవ్, శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక కాస్కోండి!
తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలపై {పత్యేక దృష్టి కఠిన చర్యలకు ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారుల నిర్ణయం ఈనెల ఆఖరి వారం నుంచి పూర్తిస్థాయిలో అమలు విలేకరులకు వెల్లడించిన రెండు విభాగాల అధిపతులు సిటీబ్యూరో: రహదారి భద్రత నిబంధనలు తెలిసినా బేఖాతర్ చేస్తూ దూసుకుపోవడం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే నో, ఈ-చలాన్ వస్తేనో ఆ మొత్తం చెల్లించడం... ఆపై షరా మామూ లే అన్నట్లు వ్యవహరించడం... ఈ విధంగా రెచ్చిపోతూ రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్న ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, ఆర్టీఏ అధికారు లు నిర్ణయించారు. ఇప్పటికే అమలులో ఉన్న చర్యలతో పాటు ఈ నెల ఆఖరి వారం నుంచి మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జితేందర్, ఆర్టీఏ కమిషనర్ సందీప్ సుల్తానియా సంయుక్తంగా శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను స్పష్టం చేశారు. ‘ఓనర్ల’ పైనా చార్జ్‌షీట్స్... అసలు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, వాహన సామర్ధ్యానికి సరిపడిన లెసైన్స్‌లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాళ్లు సిటీలో ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిని పట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి వదిలి పెడుతున్నారు. ఇకపై ఈ తరహాలో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాతో పాటు వీరికి వాహనం ఇచ్చిన యజమాని పైనా కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కోర్టులో నేరం నిరూపితమైతే ఊచలు లెక్కపెట్టాల్సిందే. ‘ఐదింటికి’ లెసైన్స్ సస్పెన్షన్.. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ఓవల్ లోడ్, డ్రంకన్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించి ఊరుకోరు. ఆర్టీఏ అధికారుల ద్వారా వారి డ్రైవింగ్ లెసైన్స్‌ను నిర్ణీత కాలం సస్పెండ్ చేయిస్తారు. సస్పెండైన లెసైన్స్‌తో డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఈ నేరానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పక్కాగా పొల్యూషన్ ‘చెక్’... నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కాలుష్య తనిఖీ ( పొల్యూషన్ చెక్)లను కఠినతరం చేయనున్నారు. ప్రస్తుతం ఈ కాలుష్య తనిఖీ యంత్రాలు రెండు సిలిండర్ల పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. దీన్ని నాలుగు సిలిండర్ల పరిజ్ఞానానికి మార్చుకోవడం, డేటాను ఆన్లైన్ చేయడం కచ్చితం చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్లు, యూని యన్లతో చర్చల దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలో అమలు చేస్తారు. ఆపై ప్రతి వాహనమూ కాలుష్య పరీక్షల ధ్రువపత్రం కలిగి ఉండాలన్నది కచ్చితం చేయనున్నారు. ప్రత్యామ్నాయ చిరునామాకు ‘సైట్’... సిటీలో నడుస్తున్న అనేక వాహనాలు వాటి యజ మానుల పేర్లతో, ప్రస్తుత చిరునామాలతో ఉండట్లేదు. దీనివల్ల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ- చలాన్ల జారీ సాధ్యం కాకపోవడంతో పాటు అత్యవసర సమయాల్లో యజమానుల్ని, వారి కుటుంబీకుల్ని గుర్తించడం కష్టసాధ్యంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆర్టీఏ వెబ్సైట్లో (్టట్చటఞౌట్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ) ‘ఆల్ట్రనేట్ అడ్ర స్’ అనే లింకు చేర్చారు. ఈ తరహా వాహనచోదకులు ఇందులోకి వెళ్లి ప్రత్యామ్నాయ చిరునామా పొందుపర్చాలి. టూవీలర్‌పై ‘ఇద్దరికీ’ హెల్మెట్ మస్ట్... ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వాహనాన్ని నడుపుతున్న వారి కంటే వెనుక కూర్చున్న వారే ఎక్కువ మంది చనిపోతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గతనెల్లో హెల్మెట్ ధరించని 50 వేల మందిపై కేసులు నమోదు చేశామని, వీటిలో వెనుక కూర్చున్న వారు పెట్టుకోని కేసులూ ఉన్నాయన్నారు. రిపీటెడ్ వైలేటర్స్ పైనే రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నాం. లెసైన్స్ రద్దు, చార్జ్‌షీట్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన రిపీటెడ్ వైలేటర్స్కు మాత్రమే అమలు చేస్తాం. ప్రస్తుతం అన్నీ ఆన్లైన్ చేయడంతో రిపీటెడ్ వైలేటర్స్, సస్పెండైన లెసైన్స్ వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలోని పీడీఏ మిషన్ల సాయంతో పరిశీలించవచ్చు. ‘ఓవర్ స్పీడింగ్’ నిబంధనను అధికారికంగా వేగాన్ని నిర్దేశించి, సైనే జ్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే అమలు చేస్తాం. - జితేందర్, ట్రాఫిక్ చీఫ్ నిమిషానికో రోడ్డు ప్రమాదం ఏటా దేశంలో ప్రతి నిమిషానికీ ఓ రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో అత్యధికం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. నిబంధనలు, భద్రతా నియమాలు తెలిసి కూడా పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఆధునిక పరి జ్ఞానం జోడిస్తూ డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ విధానాన్నీ మార్చనున్నాం. నిబంధనల అమలుతో పాటు మౌళిక సదుపాయాల అభివృద్ధి, ట్రామా సెంటర్ల ఏర్పాటు, బ్లాక్‌స్పాట్స్‌కు మరమ్మతులు వంటి చర్యల్నీ ప్రభుత్వం తీసుకుటోంది. - సుల్తానియా, ఆర్టీఏ కమిషనర్ -
బీమా గడువు దాటితే బాదుడే..!
3 లక్షల వాహనాలకు రూ.1000 చొప్పున చలానా.... విధించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో హైదరాబాద్‌లో శ్రీకారానికి కసరత్తు దేశంలోనే తొలిసారిగా అమలు మియాపూర్‌కు చెందిన రవీందర్ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. కారు రోడ్డెక్కితే చలానా పడుతుందని, నేడో..రేపో ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేశాక కారును బయటకు తీద్దామని ఇంట్లోనే ఉంచాడు. ఈలోగా సైబరాబాద్ పోలీసుల నుంచి రూ.1000 చలానా కట్టాలని రవీందర్ ఇంటికి రసీదు చేరింది. తాను కారును రోడ్డుపైకి తీసుకెళ్లకున్నా... ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వంటనే చలానా విధించడాన్ని చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. ఇలా ఒక్క రవీందరేకాదు... నెల రోజుల వ ్యవధిలో సుమారు మూడు లక్షల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు రోడ్డుమీద తిరగకున్నా...ఇంట్లో ఉన్నా గడువులోగా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుంటే ఆటోమెటిక్‌గా చలానా బారిన పడడం ఖాయమని...ఇలా చలానా విధించే అధికారం తమకు మోటారు వాహనాల చట్టం (196) కల్పించిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు కూడా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే..ఇన్సూరెన్స్ గడువు ముగిసి..రెన్యూవల్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాహనానికి చలానా విధించే అధికారం లేదని, కేవలం రోడ్డుపై తిరిగే వాహనాలకు మాత్రమే చలానా విధించాలని మోటారు వాహనాల చట్టం చెబుతోంద ని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ పేర్కొన్నారు. ఒకపక్క ట్రాఫిక్ పోలీసులు చట్టం ప్రకారమే చలానా వేస్తున్నామంటుండగా.. మరోపక్క ఆ ఆధికారం పోలీసులకు లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. బాధితులకు ఇన్సూరెన్సే ఆసరా... రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఊరట కలిగించేది ప్రమాదానికి కారణమైన వాహన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే. వాహనానికి ఇది లేకపోతే మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సిందే. సైబరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 33 శాతం వాహనాలు ‘థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్’ రెన్యూవల్ చేసుకోలేదని దర్యాప్తులో తేలింది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి చెక్‌పెట్టేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతిలు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోని వాహనదారులపై కొరడా జులిపిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని రకాల వాహనాలకు సంబంధించిన (బైక్, ఆటో, కారు, జీపు, లారీ, డీసీఎం, భారీ వాహనాలు) ఇన్సూరెన్స్ డేటాను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీఐ) నేతృత్వంలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ (ఐఆర్ఏ) నుంచి తెప్పించుకున్నారు. ఈ డేటా ఆధారంగా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోని వాహనదారులకు రూ.1000 చొప్పున చలానా విధిస్తున్నారు. హెచ్చరిక చేసి ఉంటే బాగుండేది... పోలీసులు, రవాణా అధికారుల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. దీంతో చలానా భారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో తెలియక వాహనదారులు సతమతమవుతున్నారు. కనీసం ఇలాంటి విధానం అమలుచేసే ముందు హెచ్చరికలు పంపితే కొంతమేరైనా తమకు వెసులుబాటు ఉండేదంటున్నారు. బాధితులకు ఊరట కల్పించేందుకే... థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్ల రోడ్డు ప్రమాద బాధితులు నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోని ప్రతి వాహనానికి చలానా వేస్తున్నాం. ఇన్యూరెన్స్ లేని వాహనం రోడ్డు ఎక్కాలి.. తనిఖీల్లో మేం పట్టుకోవాలనేది లేదు. డేటా బేస్ ఆధారంగా చలానాలు విధించే అధికారం మోటారు వాహన చట్టం మాకు కల్పించింది. ఇలా చేయడం వల్ల వాహనదారులు బీమా గడువు ముగియకముందే అప్రమత్తమై రెన్యూవల్ చేసుకుంటారు. తద్వారా బాధితులకు కనీస న్యాయం జరుగుతుంది. - మహంతి,ట్రాఫిక్ డీసీపీ చలానా విధించే అధికారం లేదు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేయడం వాహనదారుడి బాధ్యత. ఆ ఇన్సూరెన్స్లేని వాహనాలు రోడ్డుపై తిరిగినప్పుడు మాత్రమే చలానా వేసే అధికారం అధికారులకు ఉంది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా ఇంట్లోనే ఉన్న వాహనాలకు చలానా విధించే అధికారం మోటారు వాహన చట్టంలో లేదు. - రఘునాథ్, ఆర్టీఏ జాయింట్ కమిషనర్