
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన పెండిగ్ చలాన్ల క్లియరెన్స్ మంచి స్పందన వస్తోంది. 75 శాతం పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చంటూ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. 2022 మార్చి 1 నుంచి 31 వరకు ఈ ఆఫర్ కొనసాగుతోంది. కాగా ట్రాఫిక్ చలాన్లలో డిజిటల్ పేమెంట్ పార్టనర్‌గా ఉన్న పేటీఎం ద్వారా రూ. 60 కోట్లు వసూలు అయినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై, ఫరీదాబాద్, మహారాష్ట్రలతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ఈచలాన్ ట్రాఫిక్ జరిమానా చెల్లింపు సేవల్లో పేటీఎం పార్ట్‌నర్‌గా ఉంది. పెండింగ్ చలాన్లను ట్రాఫిక్ పోలీసు విభాగం వెబ్‌సైట్‌తో పాటు పేటీఎం యాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు. 2022 మార్చి 31తో గడువు ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment