
వీకెండ్‌లోనో, లేదా అత్యవసరం అనుకున్నపుడో ఫ్రెండ్‌కారును తీసుకొని వెళ్లడం చాలామందికి అలవాటు. అలాగే అద్దె కారులో అయినా సరే హిల్ స్టేషన్లకు చెక్కేస్తారు చాలామంది. అయితే అలాంటి వారి గుండ గుభిల్లు మనే వార్త ఇది. స్రేహితుడి కారులో రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఒక ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఫ్రెండ్ కారు తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన టూరిస్ట్‌లకు భారీ పెనాల్టి విధించారు అక్కడి పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను సీతారామ్ 12456 తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. దీని ప్రకారం అక్కడి ట్రాఫిక్ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఆపారు. చిన్న వీడియోలో కుటుంబం ప్రయాణిస్తున్న కారు కనిపించలేదు. కానీ వీడియోలోని వ్యక్తి తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అతను చూపించిన పత్రాలను చూసిన పోలీసులు మరొకరి కారును ఉపయోగించడనాఇకి అనుమతిలేదని చలాన్ జారీ చేస్తామని డ్రైవర్‌కు చెప్పడం, దీంతో ఇరువురూ కాసేపు వాదించు కోవడం చూడొచ్చు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న పోలీసులు అసలు కారు ఓనరుకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నారు. చివరికి చలానా విధించారు. (ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు)
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటంటే స్నేహితుడు లేదా బంధువు కారును వారి సమ్మతితో తీసుకు వెళ్లడం, నడపడం నిజానికి చట్టవిరుద్ధం కాదు. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది టూర్ ఆపరేటర్లు కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ఆదా చేసేందుకు పర్యాటకులకు ప్రైవేట్ రిజిస్టర్డ్ కార్లను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలా వ్యవహరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు యజమాని నుండి సమ్మతితో కారును తీసుకున్నట్లయితే, అది చట్టవిరుద్ధం కాదు. ఒకవేళ పోలీసులు తప్పుగా చలాన్ జారీ చేస్తే, ఈ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
అలాగే చెన్నైలో యజమానికి తెలియకుండా స్నేహితుడి లేదా బంధువుల వాహనం నడుపుతూ పట్టుబడితే, చెన్నై పోలీసులు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. సాధారణ తనిఖీల సమయంలో కారు లేదా బైక్ తమ స్నేహితుడిదేనని చాలా మంది పేర్కొంటున్నందున, నగరంలో వాహనాల దొంగతనాల సంఖ్యను తగ్గించేలా ఇలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!)
Comments
Please login to add a commentAdd a comment