Rental car
-
ఫ్రెండ్ కారులో వీకెండ్ ట్రిప్‌కు చెక్కేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
వీకెండ్‌లోనో, లేదా అత్యవసరం అనుకున్నపుడో ఫ్రెండ్కారును తీసుకొని వెళ్లడం చాలామందికి అలవాటు. అలాగే అద్దె కారులో అయినా సరే హిల్ స్టేషన్లకు చెక్కేస్తారు చాలామంది. అయితే అలాంటి వారి గుండ గుభిల్లు మనే వార్త ఇది. స్రేహితుడి కారులో రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఒక ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫ్రెండ్ కారు తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన టూరిస్ట్‌లకు భారీ పెనాల్టి విధించారు అక్కడి పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను సీతారామ్ 12456 తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. దీని ప్రకారం అక్కడి ట్రాఫిక్ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఆపారు. చిన్న వీడియోలో కుటుంబం ప్రయాణిస్తున్న కారు కనిపించలేదు. కానీ వీడియోలోని వ్యక్తి తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అతను చూపించిన పత్రాలను చూసిన పోలీసులు మరొకరి కారును ఉపయోగించడనాఇకి అనుమతిలేదని చలాన్ జారీ చేస్తామని డ్రైవర్‌కు చెప్పడం, దీంతో ఇరువురూ కాసేపు వాదించు కోవడం చూడొచ్చు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న పోలీసులు అసలు కారు ఓనరుకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నారు. చివరికి చలానా విధించారు. (ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు) అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటంటే స్నేహితుడు లేదా బంధువు కారును వారి సమ్మతితో తీసుకు వెళ్లడం, నడపడం నిజానికి చట్టవిరుద్ధం కాదు. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది టూర్ ఆపరేటర్లు కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ఆదా చేసేందుకు పర్యాటకులకు ప్రైవేట్ రిజిస్టర్డ్ కార్లను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలా వ్యవహరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు యజమాని నుండి సమ్మతితో కారును తీసుకున్నట్లయితే, అది చట్టవిరుద్ధం కాదు. ఒకవేళ పోలీసులు తప్పుగా చలాన్ జారీ చేస్తే, ఈ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే చెన్నైలో యజమానికి తెలియకుండా స్నేహితుడి లేదా బంధువుల వాహనం నడుపుతూ పట్టుబడితే, చెన్నై పోలీసులు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. సాధారణ తనిఖీల సమయంలో కారు లేదా బైక్ తమ స్నేహితుడిదేనని చాలా మంది పేర్కొంటున్నందున, నగరంలో వాహనాల దొంగతనాల సంఖ్యను తగ్గించేలా ఇలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) -
బురదగుంతే పట్టించింది!
♦ అద్దె కారులో వచ్చిన రూపేశ్‌కుమార్ మోహనాని ♦ తీవ్ర కలకలం రేపిన ఘటన ♦ ‘మదన్‌పల్లి’ ఘటన.. కారు బురదలో ఇరుక్కోవడంతో పట్టుబడిన నిందితుడు శంషాబాద్ రూరల్: అమావాస్య రోజు.. రాత్రి వేళ.. ఊరి పొలిమేరలో మంటలు చెలరేగడం ఆ గ్రామస్తుల్లో అనుమానాలు రేకెత్తించింది. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ ఓ మృతదేహం తగులబడుతుండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని మదన్‌పల్లి వద్ద నగరానికి చెందిన రూపేశ్‌కుమార్ మోహనాని సోమవారం రాత్రి తన భార్య మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అతడు పరారవుతుండగా కారు బురదలో ఇరుక్కుపోవడంతో రూపేశ్‌కుమార్ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. జాతీయ రహదారికి సుమారు కిలోమీటరు దూరంలో మృతదేహాన్ని కాల్చి వేయగా.. అక్కడ నుంచి రహదారిపైకి చేరుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ.. చీకట్లో దారి తెలియక నిందితుడు వచ్చిన దారిలోనే వెళ్తుండగా కారు బురదగుంతలో ఇరుక్కుపోయింది. ఒకవేళ వేరే మార్గంలో వెళ్తే నిందితుడు సులువుగా తప్పించుకునే అవకాశం ఉండేది. కాని, అప్పటికే గ్రామస్తులు అప్రమత్తం కావడం.. నిందితుడి కదలికలపై అనుమానాలు రావడంతో దొరికిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒక వేళ నిందితుడు అక్కడి నుంచి సులువుగా తప్పించుకుని వెళ్లి ఉంటే మృతదేహం ఆనవాళ్లు తెలియక ఈ కేసు మిస్టరీగా మారి ఉండేదేమో. ఇదిలా ఉండగా ఈ ఘటనలో రూపేశ్‌కుమార్ అద్దెకారు వినియోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగరంలోని గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ తన కుటుంబంతో కలిసి తిరిగేందుకు జూబ్లిహిల్స్‌లోని ‘బ్లూ డ్రైవ్’ నుంచి జూన్ 30న కారును అద్దెకు తీసుకున్నాడు. మూడు రోజులపాటు కుటుంబంతో కలిసి సరదాగా అందులోనే తిరిగాడు. చివరకు తన భార్యను అంతమొందించి ఆమె మృతదేహాన్ని అద్దె కారులోనే మదన్‌పల్లి తీసుకొచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అనువైన స్థలం కోసం అన్వేషించి.. రూపేశ్‌కుమార్ తన భార్య మృతదేహాన్ని సోమవారం సాయంత్రం 5 గంటలకు కారులో తీసుకుని గచ్చిబౌలి నుంచి బయలుదేరాడు. ఔటర్ మార్గంలో శంషాబాద్ మీదుగా మదన్‌పల్లి వైపు వచ్చాడు. మృతదేహాన్ని కాల్చి వేయడానికి అనువైన స్థలం కోసం కాసేపు కారులోనే రహదారి పరిసర ప్రాంతాలను గమనిస్తూ ముందుకు వెళ్లాడు. మదన్‌పల్లి సమీపంలోకి రాగానే చీకటి పడుతుండడం.. అక్కడ దూరంగా నిర్జన ప్రదేశం కనిపించడంతో కారును అటు వైపుగా మళ్లించాడు. తాను అనుకున్న ప్లాన్ పూర్తి చేసి తిరిగి వెళ్తూ అనూహ్య పరిస్థితుల్లో పోలీసులకు చిక్కాడు. రూపేశ్‌కుమార్ మెహనాని తన భార్య సింథియా వెచెల్(30) దారుణంగా చంపేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి బ్యాగులో తీసుకొచ్చి కాల్చివేసిన విషయం తెలిసిందే. కూతురుకు ధైర్యం చెబుతూ.. భార్యను హతమార్చి ఆమె మృతదేహాన్ని పె ట్రోలు పోసి కాల్చి వేసిన తర్వాత కూడా అస లు విషయం కూతురు సానియాకు తెలియకుం డా రూపేశ్‌కుమార్ జాగ్రత్తపడ్డాడు. పోలీసుల కు చిక్కిన సమయంలోనూ విషయం కూతురు కు చెప్పవద్దంటూ వేడుకున్నాడు. గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన సమయంలో కారులోనే కూర్చుని ఉన్న సానియాకు అతను ధైర్యం చెబుతూ విషయం తెలియకుండా చూశాడు.