ఎమ్మెల్యే యాదయ్యకు రూ.500 జరిమానా
కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉండడంతో...
హైదరాబాద్: కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉండ డంతో చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు హైదరాబాద్‌లోని మాదా పూర్ ట్రాఫిక్ పోలీసులు రూ. 500 జరి మానా విధించారు. నానక్ రాంగూడ సమీపంలోని టోల్ గేట్ వద్ద గురువారం పెట్రోల్ వాహనాల ప్రారంభోత్సవ హడావుడి కొనసాగుతోంది.
ఆ సమయంలో గచ్చిబౌలి వైపు నుంచి నానక్ రాంగూడ టోల్ గేట్ వైపునకు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉన్న ఎమ్మెల్యే కారు వెళ్లడాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గమనించారు. దీంతో ట్రాఫిక్ పోలీసు లను శ్రీనివాస్ అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే కారును ఎస్‌ఐ విజయ్ మోహన్ టోల్ గేట్‌లో ఆపేశారు. తాను ఎమ్మెల్యేనని యాదయ్య చెప్ప గా ఇక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని వదిలిపెట్టడం కుదరదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్యకు రూ.500 చలానా విధించి పంపించారు. అనంతరం యాదయ్య చేవెళ్లకు బయలుదేరి వెళ్లారు.