రసూల్‌పురా : ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి అన్నారు. మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేని 150 మంది వాహనదారులు, లెసైన్స్ లేని 25 మంది ద్విచక్ర వాహనదారులు పట్టుపడ్డారు. వీరికి జరిమానా విధించారు.
సుమారు 500ల మంది వాహనదారులకు హెల్మెట్ వాడకంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. రూ.100, రూ.150 రూపాయల చొప్పున జరిమానా విధించి వారి వివరాలను డేటాబేస్‌లో పొందుపరిచారు. మరోసారి పట్టుబడితే ట్రాఫిక్ ఉల్లంఘన చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు అమానుల్లా, శ్రీనివాస్‌రావులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
Published Thu, Mar 3 2016 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement