చాంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రధాన రహదారిపై ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. ఫలక్‌నుమా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి.చంద్రకుమార్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించని, లెసైన్స్ లేని వాహనదారులు, నంబర్ ప్లేట్లు లేని వాహనదారులను ఈ సందర్భంగా గుర్తించి ఛలానాలు విధించారు. మొత్తం 160 హెల్మెట్ ధరించని వాహణదారులపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ తెలిపారు. ఇందులోనే 10 నంబర్ ప్లేట్ లేని వాహనాలు, 20 సరిగ్గా నంబర్లు రాయని వాహనాలపై కూడా కేసులు నమోదు చేశారు. పగటి పూట కూడా స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌లను కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
హెల్మెట్ టార్గెట్ గా స్పెషల్ డ్రైవ్
Published Mon, Jul 18 2016 6:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement