రహదారిపై నీల్వ ఉన్న నీరు
సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు ఈ నెల 2నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పినా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. వర్షకాలంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, అంటువ్యాధుల తీవ్రంగా ఉటుందని అందుకు స్పెషల్ డ్రైవ్ చేసి పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ఇటీవల నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు సూచించారు.
ఆందుకు అనుగుణంగానే వార్డుల వారీగా ప్రతి రోజు రెండు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని ఇన్‌చార్జి కమిషనర్ పేర్కొన్నారు. కాని ఇంత వరకు ఏవార్డులో కూడా పారిశుద్ధ్య నివారణకు గాను చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోయింది. దీంతో పట్టణంలో పారిశుద్ధ్యం సమస్య తీవ్రంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రధానంగా మురుగు( స్లమ్) కాలనీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నారు. ఇప్పటికే పట్టణంలోని సంజీవ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి డెంగ్యూ బారిన పడి మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంలో వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రధాన రహదారిపై ఉన్న మోర్ సూపర్ మార్కెట్ పక్కన మటన్, చికెన్ వ్యాపారులు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తుండడంతో కాలనీలో దుర్గంధం వస్తుందని, దీనికితోడు రాత్రిళ్లు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మురుగు కాల్వలు సైతం లేకపోవడంతో వరద, డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్యనే నిల్వ ఉంటున్నట్లు కాలనీకి చెందిన సుశీల తెలిపారు.
ఈ విషయంపై కాలనీకి చెందిన తాము పలుమార్లు కమిషనర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేసినా తమ సమస్యను పరిష్కరించడంలేదన్నారు.. ఇప్పటికే వర్షం కారణంగా బురుద మయం కావడంతో పాటు నడువలేని పరిస్థితి నెలకొందన్నారు.
మీరైన పట్టించుకోరూ..
తమ కాలనీలో నెలకొన్న కనీస సమస్యలను మీరైన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నా. తాము పలుమార్లు మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్‌లకు విన్నవించినా స్పందించలేదు. ఎమ్మెల్యేకు సైతం తెలిపాం. మురుగుకాల్వలను నిర్మించాలని కోరాం.. అయినా స్పందించలేదు. మీరైన దళిత కాలనీపై దృష్టి పెట్టాలి. - సుశీల,కాలనీవాసి సంజవ్‌నగర్