హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్ | GHMC conducts special drive on hotels | Sakshi
Sakshi News home page

హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్

Published Mon, Dec 5 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

GHMC conducts special drive on hotels

హైదరాబాద్: తమ సర్కిల్ పరిధిలోని హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నామని జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం సర్కిల్-5ఎ,బీ డిప్యూటీ కమిషనర్‌లు డాక్టర్ ఎన్.యాదగిరిరావు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ... చార్మినార్ మక్కా మసీదు సమీపంలోని నిమ్రా హోటల్‌లో అపరిశుభ్రత నెలకొందని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 3వ తేదీన తనిఖీలు చేపట్టామన్నారు. 
 
నిమ్రా హోటల్‌ను తనిఖీలు చేయగా అపరిశుభ్రతతో పాటు నాణ్యత లోపించిన తినుబండారాలు లభ్యమైనట్లు వెల్లడించారు. అన్ని హోటళ్లపై ప్రత్యేక డ్రై వ్ చేపట్టి సమస్యలున్న వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ హోటళ్లల్లో అపరిశుభ్రత, తినుబండారాల్లో నాణ్యత లోపించినట్లు ఉంటే తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement