బడి బస్సులపై రవాణా శాఖ కొరఢా
బడి బస్సులపై రవాణా శాఖ కొరఢా
Published Tue, Jun 13 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
- రెండవ రోజు కొనసాగిన తనిఖీలు
- సామర్థ్య పరీక్షలు చేయించుకోని 25 బస్సులు సీజ్
కర్నూలు : కళాశాలలు, పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. రెండవ రోజు మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇన్‌చార్జి డీటీసీ బసిరెడ్డి ఆదేశాల మేరకు ఎంవీఐలు శేఖర్‌రావు, వరప్రసాద్, ఏఎంవీఐలు రాణి, కె.వి.ఎల్.ఎన్.ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు కర్నూలులో తనిఖీలు చేపట్టారు. ఆదోని, డోన్, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా ఆ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పది బస్సులు, రెండవ రోజు 15 బస్సులను సీజ్ చేశారు. సర్టిఫికెట్లు సరిగా లేకపోవడం, అనుమతులు, సామర్థ్య పరీక్షలు చేయించుకోకపోవడం, బస్సులో విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోవడం వంటి కారణాలపై వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement