మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 17 కార్లు, ఆరు బైక్‌లు ఉన్నాయి. శనివారం రాత్రి 11 నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఏకకాలంలో 12 చోట్ల డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు.
12 మంది ఇన్‌స్పెక్టర్లు, 24 మంది ఎస్‌ఐలు, 120 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రశాసన్‌నగర్, రోడ్ నెం.45, ఫిలింనగర్, వీఎల్‌సీసీ, ఓహిరీస్ హోటల్, స్టార్ ఆస్పత్రి, కల్పా స్కూల్, బంజారాహిల్స్ రోడ్ నెం.14 వసంత భవన్, సత్యసాయి నిగమాగమం, వెంకటగిరి టీ జంక్షన్, పెద్దమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మోతాదుకి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.