సాక్షి, అమరావతి: ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు, రెండో డోసు అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కోసం 2500కి పైగా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 లక్షల కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఏపీలో ఇప్పటివరకు 2.93 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగింది.
విజయవాడ: పడమట 45 వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, జిల్లా వైద్య శాఖాధికారిణి డాక్టర్ సుహాసిని తదితరులు పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో జేసీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ తొలి డోసు అందిస్తున్నామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇస్తున్నామన్నారు.
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌కి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌పై వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ముందుగానే ప్రజలకి సమాచారమిచ్చి టైం స్లాట్ కేటాయించాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందికి ఈ స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేయనున్నామని తెలిపారు. థర్డ్ వేవ్ ముప్పుని దృష్డిలో ఉంచుకుని ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, మెడికల్, ఐదేళ్ల చిన్నారుల తల్లులు, గర్భిణులకు ఇప్పటికే నూరుశాతం వ్యాక్సిన్ వేశామని, వ్యాక్సినేషన్‌తోనే థర్డ్ వేవ్ నుంచి రక్షణ ఉంటుందని జేసీ శివశంకర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు
ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment