ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్పై దృష్టి | focus on old currency and LRS clearence | Sakshi
Sakshi News home page

ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్పై దృష్టి

Published Wed, Nov 16 2016 2:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్పై దృష్టి

ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్పై దృష్టి

నేటి నుంచి 24 వరకు హెచ్‌ఎండీఏ స్పెషల్ డ్రైవ్
ఫీజు కింద పాత కరెన్సీని ఆమోదించాలని నిర్ణయం 

 సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిది నెలల నుంచి నిరీక్షిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ పై హెచ్‌ఎండీఏ పూర్తి స్థారుులో దృష్టి సారించింది. ఈ నెల 16 నుంచి 24 వరకు పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. దీనిలో భాగంగా అధికారులు ఆయా తేదీల్లో క్షేత్రస్థారుు పరిశీలన చేయనున్నారు. ఫీజు చెల్లింపునకు పాత కరెన్సీని కూడా ఆమో దించి తద్వారా ఆదాయం పెంచుకునేందుకు హెచ్‌ఎండీఏ ఈ స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది. ఆన్‌లైన్‌లో ఆర్కిటెక్ట్ వద్ద అప్‌డేట్ చేసిన షార్ట్ ఫాల్ డాక్యుమెంట్లను పరిశీలించి అర్హత ఉన్న వాటికి త్వరితగతిన క్లియరెన్‌‌స చేయ నున్నారు. దాదాపు హెచ్‌ఎండీఏకు వచ్చిన లక్షా 15వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో కేవలం వెరుు్యకి మాత్రమే ఇప్పటివరకు మోక్షం కలిగించారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌తో పెండింగ్‌లో ఉన్న దాదాపు లక్షా 14 వేల దరఖాస్తుల్లో అర్హతలున్న వారికి క్లియరెన్‌‌స ఇవ్వడంపై హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరం జీవులు దృష్టి సారించారు. గడిచిన ఎనిమిది నెలలుగా దరఖాస్తుల టెక్నికల్ స్క్రూటినీ, టైటిల్ వెరిఫికేషన్‌కు మాత్రమే పరిమితమైన అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో లక్షా 14 వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయారుు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎల్‌ఆర్‌ఎస్ దర ఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని చిరంజీవి నిర్ణరుుంచారు.

‘ఆయా జోనల్స్‌తో పాటు సర్కిళ్ల ఏసీపీలు దరఖాస్తులను పరిశీలించి సైట్ విజిట్ చేస్తున్నారు. అరుునా ప్రొసీ డింగ్‌‌స ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగు తోంది. ఏసీపీలు ప్రాసెస్ చేసినవి, షార్ట్ ఫాల్ ఉన్న దరఖాస్తులే 15 వేలకు పైగా ఉన్నారుు. వీరందరి నుంచి ఫీజు కట్టించి, ప్రొసీడింగ్‌‌స జారీ చేస్తాం. సిబ్బంది కొరత ఉన్నా అనుకున్న సమయానికి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అర్హత గల వారికి అనుమతిస్తామని’ చిరంజీవి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement