ఆదాయంపై దాగుడు మూతలు | muncipality and panchayath special drive on NPA's collections | Sakshi
Sakshi News home page

ఆదాయంపై దాగుడు మూతలు

Published Sat, Nov 19 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

ఆదాయంపై దాగుడు మూతలు

ఆదాయంపై దాగుడు మూతలు

ఓవైపు పడిపోతోందనే ఆందోళన.. మరోవైపు పెంచుకునే అవకాశాలు
నోట్ల రద్దును అనుకూలంగా మలుచుకుంటే భారీ ఆదాయం
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెరిగిన వసూళ్లు
అన్ని శాఖల్లో బకారుుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని ఓ వైపు ఆందోళన వ్యక్తమవుతున్నా.. ప్రస్తుత పరిణామాలను అనువుగా మలుచుకుంటే ఆదాయం పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వ ఫీజులు, చార్జీలు, పన్నులు, జరిమానాలన్నీ పాత కరెన్సీతో చెల్లించవచ్చంటూ కేంద్రం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలతో పాటు వివిధ కార్పొరేషన్లు తమ బిల్లులు, పన్నులు, బకారుుల వసూలు కు చేపట్టిన ప్రచారం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల రూపంలో రూ.200కోట్లకు పైగా సమకూరారుు.

రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో గ్రామ పంచాయతీల్లో రూ.32 కోట్ల పన్నులు, పాత బకారుులు వసూలయ్యారుు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీలన్నింటా పన్నుల వసూలు కోట్లలోకి చేరింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో వసూళ్లు రూ.7.55 కోట్లు దాటారుు. కరెంటు బిల్లుల చెల్లింపులకు సైతం పాత నోట్లు తీసుకుంటుండడంతో ఎస్‌డీపీసీఎల్ పరిధిలో ఈ నెల 11 నుంచి శుక్రవారం వరకు రూ.851 కోట్ల బిల్లులు వసూలయ్యారుు. సాధారణ రోజులతో పోలిస్తే వసూలు రెట్టింపు స్థారుుకి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోనూ బిల్లుల వసూలు వేగం పుంజుకుంది.

ఈ పరిస్థితిని వినియోగించుకునేందుకు వాణి జ్య పన్నుల శాఖ కూడా రూ.1,194 కోట్ల బకారుుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అందులో గత వారంలో రూ.184 కోట్లు వసూలైనట్లు అధికారులు ప్రకటించారు. డీలర్లు, బకారుుదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపించి.. పెద్ద నోట్లు వినియోగించుకునేలా ఈ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.

వ్యాట్‌కు పెట్రోల్‌తో ఊరట
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ ద్వారా దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుం ది. నోట్ల రద్దుతో వ్యాపారాలన్నీ స్తంభించడంతో ఈ ఆదాయం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమైంది. కానీ పెట్రోల్ బంకుల్లో పాత పెద్ద నోట్లను వినియోగించే అవకాశమివ్వడంతో కొంత ఊరట లభిస్తోంది. నోట్ల రద్దు ప్రకటించిన తొలి మూడు రోజుల్లోనే 110 శాతం పెట్రోల్, 98 శాతం డీజిల్ అమ్మకాలు పెరిగారుు. రాష్ట్రానికి వచ్చే వ్యాట్‌లో సింహభాగం పెట్రోలియం, మద్యం అమ్మకాల ద్వారానే సమకూరుతుం ది. దీంతో ఈ నెలలో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు.

ప్రచారం లేకనే తగ్గిన రిజిస్ట్రేషన్లు
నోట్ల రద్దు నిర్ణయం ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని దెబ్బతీసింది. 9, 10 తేదీల్లో పాత నోట్ల వినియోగంపై స్పష్టత లేకపోవటంతో ఈ శాఖపై ప్రభావం చూపింది. ఈ శాఖలో రోజుకు సగటున రూ.15 కోట్ల ఆదాయం వస్తుంది. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే ఇది రూ.90లక్షలకు పడిపోరుుంది. తర్వాత క్రమంగా పెరిగింది. పెద్ద నోట్లతో చెల్లించగలిగే విషయంపై ప్రచారం చేస్తే ఈనెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలున్నారుు. అరుుతే స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణం రంగం కుదేలయ్యే పరిస్థితులు ఉండడంతో భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోతుందనే అంచనాలున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement