మారేడుపల్లి (హైదరాబాద్): పోలీసులు సిగ్నల్ వద్ద లేరుగా.. మనల్నెవరూ చూడరనుకుని వెళ్లే వారికి తాజాగా ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. సిగ్నళ్ల వద్ద పోలీసులు లేకున్నా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా బాదుడు మాత్రం తప్పదు. నార్త్ జోన్ పరిధిలోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించి సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్‌తో పాటు ట్రిపుల్ రైడింగ్ చెస్తున్న 153 మందికి జరిమానా విధించారు. జూబ్లీ బస్టాండ్ వద్ద గల స్వీకార్ ఉపకార్ సిగ్నల్ వద్ద మఫ్టీలో కొంత మంది సిబ్బందిని రూల్ బ్రేకర్స్ కోసం ఏర్పాటు చేశారు.
పోలీసులు. నిబంధనలను పట్టించుకోకుండా వాళ్లు అటు వెళ్లగానే వెర్లైస్‌సెట్‌లో వారి వాహనం నంబరు వివరాలను మఫ్టీలో అక్కడే ఉన్న కానిస్టేబుల్.. మరో సిగ్నల్ వద్ద ఆ రూట్‌లో రెడీగా ఉన్న ఎస్‌ఐ స్థాయి అధికారి చెబుతాడు. దీంతో ఆయన వారిని పట్టుకునిచలాన్ రాస్తారు. విదేశాల్లో కనిపించే ఈ విధానాన్ని స్పెషల్ డ్రైై వ్ సందర్భంగా మంగళవారం నార్త్ జోన్ లోని మహంకాళి, మారేడుపల్లి, బేగంపేట, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్టేషన్ల పరిధిలో చేపట్టి.. నిబంధనలను అతిక్రమించిన 153 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. పట్టుబడ్డ వారిలో నలుగురు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఉన్నారు.
వినూత్న స్పెషల్ డ్రైవ్‌లో 153 మందికి జరిమానా
Published Tue, Sep 1 2015 9:26 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement