
సైకిల్‌కు పేటీఎం క్యూఆర్ కోడ్‌తో సమోసా విక్రయదారుడు
సూరారం: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది.. సినిమా, రైల్, బస్సు టికెట్లతో పాటు హోటల్ ఆహారం ఇలా అన్ని ఆన్‌లైన్, పేమెంట్ య్యాప్‌ల ద్వారా కొనుగోలు జరుగుతున్నాయి. కొబ్బరి బొండం, పానీపూరి, చెరుకు రసం, టీస్టాల్, సమోసా విక్రయదారులు పేటీఎం క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేపడుతున్నారు. మంగళవారం చింతల్ శ్రీనివాస్‌నగర్‌లో ఓ సమోసా వ్యాపారి సైకిల్‌కు పేటీఎం క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి వీధుల్లో తిరుగుతూ విక్రయాలు చేపడుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment