Cardless Transactions: How To Withdrawl Money Without Using ATM Card - Sakshi
Sakshi News home page

ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా 

Published Fri, Apr 2 2021 5:31 PM | Last Updated on Fri, Apr 2 2021 8:08 PM

You Can Now Withdraw Cash From ATMs without using your cards - Sakshi

గతంలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయాలంటే సదురు బ్యాంకు శాఖకు వెళ్లి నగదును తీసుకునేవాళ్లం. ఇక ఏటీఎం మిషన్ వచ్చాక బ్యాంకుకు వెళ్లకుండానే కార్డులు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నాం. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల త్వరలో ఏటీఎం కార్డు అవసరం లేకుండానే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం కేంద్రాలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెంతో సమయం ఆగాల్సిన అవసరం లేదు.

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్(ఎటిఎం) తయారుచేసే ఎన్‌సీఆర్ కార్పొరేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యుపీఐ) ప్లాట్‌ఫాంతో కలిసి మొట్టమొదటి సారిగా ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా(ఐసిసిడబ్ల్యు) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్‌సీఆర్‌తో చేతులు కలిపింది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని బ్యాంక్ ఇప్పటికే 1,500 ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఏటీఎంలలో ఎటువంటి కార్డు అవసరం లేకుండానే స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. "మొబైల్ ఫోన్‌లో ఉన్న యుపీఐ యాప్‌ ద్వారా ఎటిఎమ్‌ లో ఉన్న క్యూఆర్ కోడ్ క్యాష్ విత్ డ్రా చేయవచ్చు, దీని కోసం ఎటువంటి కార్డులు అవసరం లేదు" అని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & ఎన్‌సీఆర్ కార్పొరేషన్లో సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు నవ్రోజ్ దస్తూర్ పీటీఐకి చెప్పారు.

ఎలా పని చేస్తుంది
ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు తమ మొబైల్ లోని యుపీఐ ఎనేబుల్ చేసిన బీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి కార్డ్స్ కూడా అవసరం లేదు. మొదట ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఎంతమొత్తం డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. అంతే యూపీఐ యాప్‌లో ప్రాసెస్ పూర్తి కాగానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. ప్రస్తుతం, పరీక్ష దశలో ఉంది కాబట్టి రూ.5వేలకు డ్రా మించి విత్ డ్రా చేయలేరు.

ఇది సురక్షితమేనా?
భద్రతా విషయంలో ఇది ఇంకా అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కార్డు అవసరం లేదు కాబట్టి కార్డుతో జరిగే మోసాలు అరికట్టవచ్చు. ఇక ఈ లావాదేవీ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి లావాదేవీ సమయంలో క్యూఆర్ కోడ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సేవలను అన్ని బ్యాంకుల యూజర్లకు అందుబాటులోకి తీసుకోని రావడానికి ఎన్‌సీఆర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు నవ్రోజ్ దస్తూర్ తెలిపారు.

చదవండి:

రిలయన్స్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ డీల్‌ గడువు పొడగింపు

రైల్వే ప్రయాణికులకు తీపికబురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement