అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే
తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 14 స్టేషన్లలో అమలు
సాక్షి, హైదరాబాద్: సాధారణ రైల్వే టికెట్‌లను క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టారు. జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. టికెట్ కొనుగోలు చేసే సమయంలో జనరల్ బుకింగ్ కౌంటర్ల టికెట్ విండో వద్ద ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ వివరాలు, చార్జీలను అందుబాటులో ఉంచుతారు.
అందుకనుగుణంగా చార్జీలు చెల్లించి క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఈ డిస్‌ప్లే బోర్డులో రైలు బయల్దేరే స్టేషన్, చేరుకొనే స్టేషన్, ప్రయాణపు తరగతి, పెద్దలు, పిల్లల సంఖ్య, చార్జీలు వంటి వివరాలను ప్రదర్శిస్తారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, బేగంపేట్, కాజీపేట, జేమ్స్‌స్ట్రీట్, ఫతేనగర్ బ్రిడ్జ్, వరంగల్, మంచిర్యాల, మహబూబాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలోని 31 కౌంటర్ల ద్వారా నగదు రహిత లావాదేవీల సదుపాయాన్ని ప్రయాణికులు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment