వెండింగ్ మిషన్‌పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: అన్ రిజర్వ్‌డ్ రైల్వే టిక్కెట్‌లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల కోసం ఇకక్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్‌తో మరింత సులభంగా ఈ టిక్కెట్‌లు తీసుకోవచ్చు. నగదు రహిత సేవలను మరింత ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణమధ్యరైల్వే తాజాగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
రైల్వేస్టేషన్లలోని ఆటోమేటిక్ టికె ట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎం) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం ఈ క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుపాయాన్ని అందుబా టులోకి తెచ్చారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేసిన తరువాత, ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎమ్, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు.
క్యూఆర్ కోడ్ ద్వా రా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు స్క్రీన్‌పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్‌లో స్కాన్ చేస్తే టికెట్ చార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత టికెట్ మెషిన్ ద్వారా బయటకు వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు.
స్మార్ట్‌కార్డు లేకపోయినా...
ఏటీవీఎంల ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు కచి్చతంగా నగదుతో కూడిన స్మార్ట్ కా ర్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎ ప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్ పద్ధతిలో లేదా జనరల్ బుకింగ్ కౌంటర్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స దుపాయానికి అదనంగా పేటీఎమ్, యూ పీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు.
ఈ పద్ధతిలో స్మార్ట్ కార్డ్ అవసరం ఉండదు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment