రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్‌! | Indian Railways Restricted platform entry Only Confirmed tickets | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్‌!

Published Sun, Mar 9 2025 6:57 AM | Last Updated on Sun, Mar 9 2025 8:50 AM

Indian Railways Restricted platform entry Only Confirmed tickets

సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫార్మ్‌ టికెట్‌ ఉంటేనే ప్లాట్‌ఫామ్‌ పైకి వెళ్ల గలుగుతారు. పైలట్‌ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్‌ విహార్, సూరత్, వారణాసి, అయోధ్య, పాట్నా రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రైల్వే శాఖ ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు.

తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలోని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేసి.. కన్ఫార్మ్‌ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించాలని నిర్ణయించారు. మహా కుంభమేళా సందర్భంగా దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా వెయింటింగ్‌ రూములు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, సూరత్, పాట్నాల్లో రద్దీని నియంత్రించడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. రైలు విచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.

60 స్టేషన్లలో తాత్కాలికంగా నిర్మించిన వెయిటింగ్‌ రూములను శాశ్వతంగా ఉపయోగపడేలా మార్చబోతున్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో రైళ్ల సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయిస్తారు. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ కూడా ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఢిల్లీ స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement