platform tickets
-
క్యూఆర్ కోడ్‌తో రైల్వే టిక్కెట్లు
సాక్షి, హైదరాబాద్: అన్ రిజర్వ్డ్ రైల్వే టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల కోసం ఇకక్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్‌తో మరింత సులభంగా ఈ టిక్కెట్లు తీసుకోవచ్చు. నగదు రహిత సేవలను మరింత ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణమధ్యరైల్వే తాజాగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వేస్టేషన్లలోని ఆటోమేటిక్ టికె ట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎం) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం ఈ క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుపాయాన్ని అందుబా టులోకి తెచ్చారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేసిన తరువాత, ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎమ్, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వా రా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు స్క్రీన్‌పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే టికెట్ చార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత టికెట్ మెషిన్ ద్వారా బయటకు వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. స్మార్ట్‌కార్డు లేకపోయినా... ఏటీవీఎంల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు కచి్చతంగా నగదుతో కూడిన స్మార్ట్ కా ర్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎ ప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో లేదా జనరల్ బుకింగ్ కౌంటర్లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స దుపాయానికి అదనంగా పేటీఎమ్, యూ పీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో స్మార్ట్ కార్డ్ అవసరం ఉండదు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
ప్లాట్‌ఫాం టిక్కెట్ చార్జీ పెంపు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ నియంత్రణ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచింది. ఈ నెల 8వ తేదీ నుంచి 20 వరకు కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో పెద్ద ఎత్తున జన సమూహం ప్లాట్‌ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు, రద్దీ వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. గతంలో కోవిడ్ కారణంగా ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50 నుంచి రూ.20కి తగ్గించారు. మిగతా స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10కి తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేరుగా కౌంటర్ వద్ద, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
బాప్రే! రైలెక్కితే రూ.5.. ఎక్కకపోతే రూ.50
సాక్షి, ముంబై: రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అలోచించాలని, ప్లాట్ఫారం చార్జీలు పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపడం సరైన పద్దతి కాదని రైల్వేపై ప్రయాణికుల సంఘటనలు మండిపడుతున్నాయి. లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కనీస టికెట్ చార్జీ రూ.5 ఉండగా కేవలం ప్లాట్ఫారం టికెట్‌కు రూ.50 ఎలా వసూలు చేస్తున్నారని ప్రయాణికుల సంఘటన నిలదీసింది. ప్లాట్ఫారం టికెట్‌పై రైళ్లలో ప్రయాణించేందుకు అవకాశమే లేదని, అయినప్పటికీ రూ.50 వసూలు చేయడమేంటని సంఘటన ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. రూ.5 చెల్లించి లోకల్ రైలు టికెట్ తీసుకుని ప్లాట్‌ఫారంపై వెళ్లడం గిట్టుబాటవుతుందని కొందరు భావిస్తున్నారని తెలిపింది. కాగా, రద్దీని నియంత్రించే మార్గం ఇదికాదని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అలోచించాలని రైల్వే అధికారులకు సూచించారు. మార్చి నుంచే అమలు.. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రద్దీగా ఉండే ప్రముఖ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), దాదర్ టర్మినస్, కుర్లా టెర్మినస్, బాంద్రా టర్మినస్, ముంబై సెంట్రల్ తదితర ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్లాట్‌ఫారాల చార్జీలు ఐదు రేట్లు పెంచింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న ప్లాట్ఫారం చార్జీలను మార్చి ఒకటో తేదీ నుంచి ఏకంగా రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అయితే రద్దీని నియంత్రించడానికి ప్రత్నామ్యాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. కాని స్వగ్రామాలకు, పర్యటనకు, పుణ్య క్షేత్రాలకు బయలుదేరే తమ బంధువులను సాగనంపేందుకు స్టేషన్‌కు వచ్చే వారి నుంచి ఇలా భారీగా ప్లాట్ఫారం చార్జీల వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని సంఘటన ప్రశ్నించింది. త్వరలో వేసవి సెలవులు, శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. పెద్ద సంఖ్య జనాలు స్వగ్రామాలకు, పర్యాటక ప్రాంతాలకు బయలుదేరుతారు. పిల్లపాపలు, వృద్ధులు, వికలాంగులు, భారీ లగేజీతో స్టేషన్‌కు వస్తారని తెలిపింది. వారిని సాగనంపేందుకు ఒకరిద్దరు దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు వస్తారని, కానీ, ప్లాట్ఫారం చార్జీలు రూ.50 చొప్పున వసూలు చేయడంవల్ల అనేక మంది స్టేషన్ బయట నుంచి తిరిగి వెళ్లిపోతున్నారని సంఘటన గుర్తుచేసింది. కాగా, రైల్వేస్టేషన్స్‌లో ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారని, జనాల రద్ధీని తగ్గించేందుకు రైల్వే ప్లాట్ఫారం టికెట్ల ధరలు పెంచేసి యాభై రూపాయలు చేసింది. ఈ పెంచిన ధరలు జూన్ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి శివాజీ సుతార్ ఇదివరకే తెలిపారు. రద్దీని తగ్గించేందుకే రేట్లను పెంచామని చెప్పారు. చదవండి: (వారంపాటు లాక్డౌన్.. కుటుంబాలు రోడ్డున పడతాయి) -
ప్రైవేటు సేవ..!
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పది రూపాయల ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీ మరింత పెరగొచ్చు. ట్రైన్ కోసం ఏసీ విశ్రాంతి గదిలో నిరీక్షణకూ రుసుము రెట్టింపు కావొచ్చు. ఫలహారం.. టాయిలెట్లతోపాటు మంచినీళ్లకు కూడా డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. ఇవేకాదు.. నామమాత్రపు రుసుములతో లభించే సేవలన్నీ ఇకపై ఖరీదు కావొచ్చు. ఎందుకంటే రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లో సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ప్రయాణికులకు ఉచితంగా అందజేయాల్సిన కనీస సదుపాయాలు కూడా రుసుముల జాబితాలో చేరనున్నాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రత, టికెట్ బుకింగ్ వంటి కొన్ని అంశాలు మినహా స్టేషన్ నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు పూర్తిగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ప్రైవేటు బాటలో రైల్వే.. రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు ఇటీవల సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా నాలుగు రైల్వేస్టేషన్లను మొదట ప్రైవేటీకరించి ఆ తర్వాత దశలవారీగా మిగతా వాటిని ప్రైవేట్ పరిధిలోకి తేనుంది. దక్షిణమధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరణ జాబితాలోచేర్చారు. రైల్వేస్టేషన్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐఆర్డీసీ) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రైవేటీకరణకు ప్రణాళికలను సిద్ధం చేసింది. త్వరలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్ నిర్వహణ మొత్తం 15 ఏళ్ల పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లీజుకు ఇవ్వనున్నారు. చార్జీలు, సేవా రుసుముల నిర్ణయం, నియంత్రణ వంటివి ప్రైవేట్ సంస్థలే చూసుకుంటాయి. ఈ సేవలు ప్రైవేట్ చేతుల్లోకి.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100 ప్యాసింజర్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. దీంతో స్టేషన్‌లోని 10 ప్లాట్‌ఫామ్‌లపై నిత్యం రద్దీ ఉంటుంది. విశ్రాంతి గదులు, రిటైరింగ్ రూమ్‌లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, టాయిలెట్లు వంటి సదుపాయాల్లో కొన్ని నామమాత్రపు చార్జీలకే లభిస్తున్నాయి. ఏసీ రిటైరింగ్ రూమ్‌లో విశ్రాంతి కోసం గంటకు రూ.25 చొప్పున వసూలు చేస్తుండగా.. మిగతా విశ్రాంతి గదులన్నీ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. రక్షిత మంచినీటిని ఉచితంగా అందజేస్తోంది. స్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న పార్కింగ్ స్లాట్లలో ధరల నిర్ణయం, రెస్టారెంట్లలో ఆహార పదార్ధాల ధరలు వంటివి ప్రస్తుతం రైల్వే నియంత్రణలోనే ఉన్నాయి. రైళ్లను శుభ్రం చేయడం, ఆన్‌బోర్డు సర్వీసులు, స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడం వంటి సేవల కోసం ఔట్సోర్సింగ్ కార్మికుల సేవలను వినియోగించుకుంటోంది. స్టేషన్ ప్రైవేటీకరణ ద్వారా ఈ సేవలన్నీ ఇక బడా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సుమారు ఏడెనిమిది రకాల ప్రయాణికుల సదుపాయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. విధానపరంగా స్టేషన్ల నిర్వహణ అంశం ఐఆర్డీసీ పరిధిలోనే ఉన్నా.. సదుపాయాలను అందజేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్న దృష్ట్యా చార్జీల నియంత్రణ నుంచి రైల్వే శాఖ పూర్తిగా తప్పుకోనుంది. రైళ్ల నిర్వహణ మాత్రమే రైల్వే పరిధిలో.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల నిర్వహణ, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ సేవలు, పట్టాలకు మరమ్మతులు, ట్రాక్ నిర్వహణ, ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణ, టికెట్ బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కౌంటర్లు మాత్రం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయి. అటకెక్కిన రీడెవలప్మెంట్.. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో 45 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించారు. ఈ లీజు ఒప్పందంలో భాగంగా రైల్వేస్టేషన్ పూర్తిగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. స్టేషన్ చుట్టూ ఉన్న రైల్వే స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు నిర్మించుకుని ఆదాయం సంపాదించుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు అవకాశం లభిస్తుంది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించినా.. ఏ సంస్థా ముందుకు రాలేదు. దీంతో రీడెవలప్మెంట్ స్థానంలో ఇప్పుడు ఉన్న సదుపాయాలను మెరుగుపర్చి ప్రయాణికులకు అందజేసేలా 15 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నిర్వహణకు ఏటా రూ.12 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఈ ఖర్చు మిగలడంతో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలు నిలిపివేత:ఉత్తర రైల్వే
న్యూఢిల్లీ:ఈ నెల పది వరకు నగరంలోని ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలని నిలిపివేయాలని ఉత్తర రైల్వే గురువారం నిర్ణయించింది. దీపావళి, ఛట్‌పూజ పండుగల నేపథ్యంలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని అధికారులను ఆదేశించింది. వీటిలో న్యూఢిల్లీ, ఢిల్లీ, హజ్రాత్ నిజాముద్దీన్, ఢిల్లీ సరై రోహిల్లా, ఆనంద్ విహర్ టెర్మినల్ స్టేషన్లు ఉన్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే వృద్ధులు, వికలాంగులు, ఆనారోగ్యం బారిన పడినవారు, ఒంటరిగా, పిల్లలతో కలిసి వెళుతున్న మహిళలను రైల్లోకి ఎక్కించేందుకు సహాయంగా వచ్చే వారి సంఖ్య వల్ల ప్లాట్‌ఫారమ్ టికెట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. అయితే స్టేషన్లలోని భారీ రద్దీని తప్పించడంతో పాటు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించామని వివరించారు.