Rail passengers
-
రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఇక నుండి ఫ్రీ ఫుడ్
-
క్యూఆర్ కోడ్‌తో రైల్వే టిక్కెట్లు
సాక్షి, హైదరాబాద్: అన్ రిజర్వ్డ్ రైల్వే టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల కోసం ఇకక్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్‌తో మరింత సులభంగా ఈ టిక్కెట్లు తీసుకోవచ్చు. నగదు రహిత సేవలను మరింత ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణమధ్యరైల్వే తాజాగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వేస్టేషన్లలోని ఆటోమేటిక్ టికె ట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎం) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం ఈ క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుపాయాన్ని అందుబా టులోకి తెచ్చారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేసిన తరువాత, ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎమ్, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వా రా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు స్క్రీన్‌పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే టికెట్ చార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత టికెట్ మెషిన్ ద్వారా బయటకు వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. స్మార్ట్‌కార్డు లేకపోయినా... ఏటీవీఎంల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు కచి్చతంగా నగదుతో కూడిన స్మార్ట్ కా ర్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎ ప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో లేదా జనరల్ బుకింగ్ కౌంటర్లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స దుపాయానికి అదనంగా పేటీఎమ్, యూ పీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో స్మార్ట్ కార్డ్ అవసరం ఉండదు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
రైళ్లలో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఫుడ్
న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార బిల్లుల్ని చెల్లించేందుకు 2,191 పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది. రైలు ప్రయాణికులు ఈ మెషీన్ల వద్ద తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆహార బిల్లులను చెల్లించవచ్చు. ప్యాంట్రీకార్లున్న రైళ్లలో పీఓఎస్ మెషీన్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో ఆహార పదార్థాలు కొనేటప్పుడు విక్రేతలు ప్రయాణికుల నుంచి అధికమొత్తాన్ని వసూలు చేయకుండా అరికట్టేందుకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లల్లో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15వరకు పీఓఎస్ మెషీన్ల పనితీరు, ఆహారపదార్థాల కొనుగోలుపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని పేర్కొంది. -
సరికొత్త యాప్‌తో రైళ్లల్లో నేరాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు ఏదో సందర్భంలో చోరీలు, వేధింపులు ఎదురయ్యే ఉంటాయి. ముఖ్యంగా మహిళలు తమ కంపార్ట్మెంట్లలో తోటి ప్రయాణికుల అసభ్య ప్రవర్తనతో ఇబ్బందులు పడి ఉంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా ‘జీరో ఎఫ్ఐఆర్’పేరుతో భారతీయ రైల్వే ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. త్వరలో దీన్ని అమల్లోకి తీసుకురానుంది. వేధింపులు, చోరీలపై వెంటనే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటుగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని ఎక్కడ నుంచైనా నమోదు చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఈ యాప్ ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదునే ఎఫ్ఐఆర్గా పరిగణించి సమీపంలోని ఆర్పీఎఫ్/జీఆర్పీ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. పాత ప్రాజెక్టే సరికొత్తగా! వాస్తవానికి ఇదేం కొత్త ప్రాజెక్టు కాదు. ప్రయాణికుల సమస్యల తక్షణ పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని, 2017 డిసెంబరు 14న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయించారు. అందులో భాగంగానే దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే యాప్‌ను మరింత అభివృద్ధి చేసి దక్షిణ మధ్య రైల్వేలో కూడా అమలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక్క సికింద్రాబాద్ నుంచే రోజుకు 210 రైళ్లు, 1,80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రతిరోజూ వివిధ కారణాల వల్ల పదుల సంఖ్యలో జీఆర్పీ, ఆర్పీఎఫ్కి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ యాప్ విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రైలు దిగాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు, వృద్ధులకు మరింత సౌకర్యంగా ఉంటుందంటున్నారు రైల్వే అధికారులు. ఈ యాప్‌లో ఆర్పీఎఫ్ పోలీసులతో పాటుగా జీఆర్పీ, టీటీఈలను కూడా అనుసంధానం చేస్తున్నారు. -
రైల్వే ఫిర్యాదుల కోసం మదద్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకుగాను మదద్ అనే మొబైల్ యాప్‌ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ యాప్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని ఇప్పటివరకు ట్వీటర్, ఫేస్బుక్ గ్రీవియెన్స్ సెల్లోనే ఫిర్యాదు చేసే అవకాశముంది. త్వరలో అందుబాటులోకి రానున్న మదద్ యాప్‌ద్వారా రైళ్లలోని ఆహార నాణ్యత, పారిశుధ్యం వంటి వాటిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతోపాటుగా అత్యవసర సేవల్ని కూడా పొందవచ్చు. ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే అవకాశముంది. -
చేజారుతున్న బతుకులు ..
గాల్లో కలిసిపోతున్న రైలు ప్రయాణికుల ప్రాణాలు ప్రమాద నివారణ చర్యలు శూన్యం ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా కారణమే గుంతకల్లు టౌన్: అత్యధిక జన సాంద్రత గల ప్రదేశమేదని ఎవరైనా అడిగితే, రైలులోని జనరల్ బోగీ అని టక్కున సమాధానం చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు, ఒంటి కాలిపై నిల్చుని చేసిన రైలు ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఓసారి అనుభవం లోకి వచ్చే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుట్‌బోర్డు వద్ద నిలుచునో, కూర్చునో ప్రయాణించేవారు ఎందరో కనిపిస్తారు. నిద్రమత్తులోనో, లోపలి జనం ఒత్తిడి కారణంగానో పట్టుజారి కింద పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు డివిజన్ మీదుగా రోజూ 120 రైళ్లు నడుస్తున్నాయి. వీరిలో అధికభాగం పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ప్రయాణికులే ఉంటారు. సకాలంలో గమ్యానికి చేరుకోవాలన్న ఆతృత, రైలుతో సీటు దొరకదేమోనన్న ఆందోళనతో రైలు ఆగకముందే లగేజీతో సహా పరుగులు తీసే దృశ్యాలు రోజూ కనిపిస్తూనే ఉంటాయి. ఆర్థిక స్తోమత లేని కారణంగా వీరంతా జనరల్ బోగీలోనే ప్రయాణిస్తుంటారు. అయితే, వీరి సంఖ్యకు అనుగుణంగా రైళ్లలో బోగీలు ఉండకపోవడం రద్దీకి కారణమవుతోంది. ఫలితంగా కొందరు ఫుట్‌బోర్డుపై ప్రయాణించాల్సిన పరిస్థితికి కారణమవుతుంది. వెళుతున్న రైలులోంచి జారిపడి మృతి చెందిన, గాయపడిన వారిలో ఇలాంటి వారే అధికంగా ఉంటున్నారు. ఇక టికెట్ లేకుండా ప్రయాణం చేసే కొందరు టీటీఈలను చూసి భయంతో కదులుతున్న రైలులోంచి దూకడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, ఈ ప్రమాదాల్లో మృతి చెందిన వారిని గుర్తు పట్టేందుకు కూడా అవకాశాలు లేకపోవడంతో, అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి. ఏడాదిలో 302 మంది మృత్యువాత గుంతకల్లు జీఆర్పీ ఎస్పీ కార్యాలయ పరిధిలో అనంతపురం, కర్నూల్, వైయస్ఆర్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది జరిగిన వివిధ ప్రమాదాల్లో దాదాపు 302 మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనల్లో పురుషులు-154 మంది, 12 మంది మహిళల మృతదేహాలు గుర్తు పట్టగా, మిగిలిన 122 మంది పురుషులు, 14 మంది మహిళల మృతదేహాలు ఎవరివైనదీ తెలియడం లేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా కారణమే.. రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారీ అధికారుల అసమర్థతను ప్రశ్నించడం సాధారణమే. అయితే, ప్రయాణికుల బాధ్యతా రాహిత్యం, అవగాహన లేమి కూడా ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. రైలు కదులుతున్నపుడు ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డుపై ప్రయాణం ప్రమాదకరమని రైలు స్టేషన్లలో ప్రకటనలు చేస్తున్నా ప్రయాణికులు పట్టించుకోవడం లేదు. ప్రమదాల నివారణకు చర్యలేవీ? ఎంతసేపూ కోట్లాది రూపాయలను ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించడం లేదు. రైల్వేస్టేషన్లు, రైళ్ల లోపల, లెవెల్‌క్రాసింగ్‌లు మొదలైన ప్రాంతాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ప్రయాణికుల్లో అవగాహన పెంపొందించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫుట్‌బోర్డు ప్రయాణాలను అరికట్టడంలో భాగంగా అవసరమైనన్ని బోగీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.