Railway booking
-
క్యూఆర్ కోడ్‌తో రైల్వే టిక్కెట్లు
సాక్షి, హైదరాబాద్: అన్ రిజర్వ్డ్ రైల్వే టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల కోసం ఇకక్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్‌తో మరింత సులభంగా ఈ టిక్కెట్లు తీసుకోవచ్చు. నగదు రహిత సేవలను మరింత ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణమధ్యరైల్వే తాజాగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వేస్టేషన్లలోని ఆటోమేటిక్ టికె ట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎం) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం ఈ క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుపాయాన్ని అందుబా టులోకి తెచ్చారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేసిన తరువాత, ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎమ్, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వా రా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు స్క్రీన్‌పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే టికెట్ చార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత టికెట్ మెషిన్ ద్వారా బయటకు వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. స్మార్ట్‌కార్డు లేకపోయినా... ఏటీవీఎంల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు కచి్చతంగా నగదుతో కూడిన స్మార్ట్ కా ర్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎ ప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో లేదా జనరల్ బుకింగ్ కౌంటర్లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స దుపాయానికి అదనంగా పేటీఎమ్, యూ పీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో స్మార్ట్ కార్డ్ అవసరం ఉండదు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
రాష్ట్రానికి వచ్చేవన్నీ..రాజధాని రైళ్లే!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ప్రకటించాక తొలిసారిగా సాధారణ ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడిచాయి. ఇటీవల వలస కూలీలను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ప్రారంభించారు. సాధారణ ప్రయాణికుల రైళ్లు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో మన రాష్ట్రం మీదుగా మూడు రైళ్లు తిరగనున్నాయి. ఢిల్లీ–సికింద్రాబాద్, సికింద్రాబాద్–ఢిల్లీ, ఢిల్లీ–బెంగళూరు, బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చెన్నై, చెన్నై–ఢిల్లీ రైళ్లు ఇందులో ఉన్నాయి. బెంగళూరు రైలు సికింద్రాబాద్ మీదుగా, చెన్నై రైలు వరంగల్ మీదుగా నడుస్తాయి. ఇవన్నీ రాజ ధాని రైళ్లే కావటం విశేషం. ఇవి కాకుండా సాధారణ సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎప్పు డు ప్రారంభించాలనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. (చదవండి: హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్) ప్రత్యేక రైళ్లు ఇవే... న్యూఢిల్లీ–సికింద్రాబాద్ ఏసీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ రైలు (02438) ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–న్యూఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ రైలు (02437) ఈ నెల 20న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇది నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతుంది. బెంగళూరు–న్యూఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (02691) ఈ నెల 12న రాత్రి 8.30కి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 8.05కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.55కు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీ–బెంగళూరు (02692) స్పెషల్ రైలు 12న రాత్రి 9.15కు ఢిల్లీలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.20కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 6.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి బెంగళూరు చేరుకుంటుంది. ఇది అనంతపూర్, గుంతకల్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీలలో ఆగుతుంది. న్యూఢిల్లీ–చెన్నై (02434) రైలు 13న (ఇది ప్రతి బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది) సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో బయలుదేరి రెండో రోజు రాత్రి 8.40కి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ (02433) స్పెషల్ రైలు చెన్నై సెంట్రల్ స్టేషన్లో 15న (ఇది ప్రతి శుక్ర, ఆదివారాలు నడుస్తుంది) ఉదయం 6.35కు బయలుదేరి రెండో రోజు ఉదయం 10.30కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇది విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రాలలో ఆగుతుంది. 15 నిమిషాల్లో టికెట్లు క్లోజ్.. చాలా రోజుల తర్వాత ప్రయాణ అవకాశం రావటంతో బుకింగ్ కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ కూడా చాలాసేపు తెరుచుకోలేదు. ప్రత్యేక రైళ్లకు సోమవారం సాయంత్రం 4 గంటలకు రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్టు రైల్వే ప్రకటించింది. కానీ సాయంత్రం 7.30 గంటల వరకు కూడా బుకింగ్ ఆప్షన్ ఆన్ కాలేదు. ఏడున్నర సమయంలో ఢిల్లీ–బెంగళూరు రైలు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆ రైలులో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న టికెట్లన్నీ కేవలం 15 నిమిషాల్లో అయిపోయాయి. అదే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో.. బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు గంట సేపట్లో అమ్ముడయ్యాయి. రాత్రి తొమ్మిది దాటే వరకు మిగతా రైళ్ల బుకింగ్స్ ఆప్షన్ తెరుచుకోలేదు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : 30 వరకూ రైల్వే బుకింగ్‌లు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగింపుపై సంప్రదింపులు సాగుతున్న క్రమంలో ఈనెల 30 వరకూ తాను నిర్వహిస్తున్న మూడు ప్రైవేట్ రైళ్ల సర్వీసులను నిలిపివేయాలని భారత రైల్వేల అనుబంధ ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఐఆర్సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్ రైళ్లను, కాశీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. ఈ రైళ్లలో ఈనెల 30 వరకూ టికెట్ల బుకింగ్‌ను రద్దు చేసినట్టు వెల్లడించింది. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ పూర్తి సొమ్మును రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. అంతకుముందు ఐఆర్సీటీసీ 21 రోజుల లాక్డౌన్ ముగిసే ఏప్రిల్ 14 వరకూ బుకింగ్స్‌ను సస్పెండ్ చేసింది. కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ వారణాసి-ఇండోర్ రూట్లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్ రైళ్లను ఏప్రిల్ 15-30 వరకూ ఐఆర్సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్సీటీసీ తెలిపింది. చదవండి : చుక్ చుక్ బండి.. దుమ్మురేపింది! -
బుకింగ్ నిబంధనల్లో మార్పుల్లేవు: రైల్వే
న్యూఢిల్లీ: రైల్వే బుకింగ్, తత్కాల్‌లకు సంబంధించిన జులై 1 నుంచి నిబంధనలు మారుతున్నాయంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో వస్తున్న వార్తలు సరికాదంటూ రైల్వే శాఖ ప్రకటించింది. ‘అది తప్పుడు ప్రచారం. నిర్ధారించుకోకుండానే కొన్ని పత్రికలు ఈ విషయాన్ని ప్రచురించాయి. దీని వల్ల గందరగోళం నెలకొంది. శతాబ్ది, రాజధాని రైళ్లలోనే కాదు ఏ రైళ్లలోనూ పేపర్ టికెట్లను తొలగించే ఆలోచన లేదు. అయితే, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారు, టికెట్ కన్ఫర్మేషన్కు సంబంధించి వారికందిన ఎస్ఎంఎస్తో పాటు, నిర్ధారిత గుర్తింపు పత్రంతో ప్రయాణం చేయవచ్చు. రద్దు చేసుకున్న ప్రయాణాలకు సంబంధించి తిరిగి చెల్లింపుల(రీఫండ్) నిబంధనల్లోనూ ఎలాంటి మార్పుల్లేవు’ అని గురువారం రైల్వే శాఖ స్పష్టం చేసింది. టిక్కెట్లపై చార్జీల్లో రాయితీలను కూడా ప్రచురించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చార్జీపై ప్రయాణికులు ఎంత రాయితీ పొందుతున్నారో వారికి తెలియాలని, చార్జీల హేతుబద్ధీకరణకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు మెంబర్ మహ్మద్ జంషెడ్ చెప్పారు. ప్రయాణికులను గ మ్యం చేర్చడానికి తమకయ్యే ఖర్చులో 57 శాతం మాత్రమే చార్జీల ద్వారా తిరిగి వస్తుందనీ, సబర్బన్ రైళ్లలో అయితే ఇది కేవలం 37 శాతమేనని ఆయన చెప్పారు. మొత్తం రైళ్ల ట్రాఫిక్‌లో సబర్బన్, తక్కువ దూరం ైరె ళ్ల ట్రాఫిక్ శాతం 52 అని, కానీ ఆదాయార్జనలో వీటి వాటా 6 నుంచి 7 శాతమేనని జంషెడ్ వివరించారు. -
ఇక ఐఆర్సీటీసీ రూపేకార్డ్తో షాపింగ్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ యూని యన్ బ్యాంక్ ప్రీ పెయిడ్ కార్డ్‌తో ఇక నుంచి మరిన్ని సర్వీసులకు చెల్లింపులు జరపవచ్చని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) మంగళవారం తెలిపింది. ఇప్పటివరకూ రైల్వే బుకింగ్‌లకు మాత్రమే పరిమితమైన ఈ కార్డ్‌తో ఇక నుంచి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆన్లైన్ షాపింగ్‌ల్లో చెల్లింపులు చేయవచ్చని ఐఆర్సీటీసీ సీఎండీ ఎ.కె. మనోచా తెలిపారు.