బెంగళూరు: 25 ఏళ్ల బెంగళూరు మహిళ గూగుల్‌లో సెర్చి చేసి వైన్ బాటిల్ కోసం ఆర్డర్ చేస్తే వైన్ రాకపోగా ఆమె ఖాతా నుంచి రూ.1.6 లక్షలను సైబర్ క్రిమినల్స్ కాజేశారు. ఈ సంఘటన జరిగిన మరుసటి వారం ఆమె పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది. వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న ఆంచల్ ఖండేల్వాల్ అనే మహిళ మార్చి 24న ఆన్‌లైన్‌లో వైన్‌ను విక్రయించి హోం డెలివరీ చేసే వారి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా ఆమెకు రణవీర్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ నంబర్‌ను కనబడింది. తనకు ఫోన్ చేసిన తర్వాత రణ్‌వీర్ సింగ్ మీరు కోరుకున్న వైన్ తన వద్ద ఉందని దానిని సరఫరా చేస్తానని ఫోన్‌లో నమ్మించాడు.
ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ చెల్లిస్తే నేరుగా ఆమె ఫ్లాట్‌కి వైన్ బాటిల్‌ను డెలివరీ చేస్తామని తను పేర్కొన్నాడు. తర్వాత వారు పంపిన క్యూఆర్ స్కాన్ కోడ్‌ను ఉపయోగించి ఆమె చెల్లింపులు చేసింది. అయితే, నిందితుడు రణవీర్ తనకు ఎటువంటి నగదు రాలేదని ఆమెను ఒప్పించి మరికొన్ని లావాదేవీలు చేసేలా చేశాడు. అలా మొత్తం ఐదు లావాదేవీలు చేయడంతో ఆమె రూ.1,59,595ను కోల్పోయింది. ఒక వారం తరువాత ఆంచల్ వైన్ పంపిణీ చేయకపోగా మోసం చేశాడని గ్రహించి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణం జరిగిన వెంటనే మహిళ 100 డయల్ చేసి పిర్యాదు చేసి ఉంటే నిందితుల బ్యాంక్ ఖాతాను నిలిపివేసేవారమని ఆమె ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment