ఊళ్లలో కొంతమంది ఉంటారు.. లోకం ఎలా పోయినా ఫర్లేదు.. నేను, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటారు. దేశం ఎలా తగలాడినా నాకేటి బాధ నా ఆదాయం బాగుంటే చాలకునుకేవాళ్లు ఇంకొందరు. అచ్చం అలాంటివాళ్లే రాజకీయాల్లోనూ ఉంటారు. విలువలు... గౌరవం.. మట్టిగడ్డ ఏమి ఎలా పొతే నాకేం.. నా లాభం... నా ప్రయోజనం నాకు ముఖ్యం అనుకుంటారు... అందులో చంద్రబాబు ఎలానూ ఉండనే ఉంటారు... ఇప్పుడు ఆ టీంలో చేరిన పవన్ కళ్యాణ్ సైతం అచ్చం అదే పాలసీ ఫాలో అవుతున్నారు.
రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఇంకా బీజేపీ వంటి పార్టీలు సైతం.. ‘‘అమ్మో.. ఎన్నికలు వస్తున్నాయి... పార్టీని నడపాలి... ఇంఛార్జులను వేయాలి ... క్యాడర్ను సమాయత్తం చేయాలి.. ఈసారి ఎలాగైనా గట్టిగా పోరాడి పార్టీని ఒక స్థాయికి తీసుకు రావాలి... అధికారం చేపట్టాలి’’ అంటూ వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి వ్యూహాలు.. సమీకరణాలు వేస్తున్నారు... కానీ జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా హాయిగా డబ్బులు కలెక్షన్ మీద దృష్టి పెట్టారు.
నా పార్టీ కోసం ఎవరూ పైసా ఇవ్వొద్దు అని, తన సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాను అని, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను అని చెబుతూ వచ్చిన జనసేనాని ఇప్పుడు ఏకంగా అధికారికంగా విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. దీనికోసం ఏకంగా క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసి నేరుగా విరాళాలు దండుకుంటున్నారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం కొత్త కాదు, తప్పు కాదు కానీ ఏకంగా ఇలా చిల్లరగా క్యూ ఆర్ కోడ్ పెట్టి దండుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నడపడం లేదు. క్యాడర్ కోసం ఏమీ చేయడం లేదు.. పవన్ సభలకు వాహనాలు.. ఇతర ఏర్పాట్ల ఖర్చు సైతం స్థానిక నాయకులే చూసుకుంటున్నారు తప్ప పార్టీ నుంచి ఏమీ మద్దతు లేదు. దీనికితోడు చంద్రబాబు కోసం దశాబ్దకాలంగా పని చేస్తున్నందుకు అయన నుంచి కూడా భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు పవన్ మీద ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నవే!.
మరి అలాంటప్పుడు.. ఇంకా ఈ చిల్లర కలెక్షన్ ఎందుకు అన్న అనుమానాలు వస్తున్నాయి. అటు బాబు నుంచి భారీగా ప్యాకేజి అందుకుంటూనే ఇటు చిల్లర కలెక్షన్ సైతం వదలడం లేదని అంటున్నారు. అంటే అయన కూడా తన గురువు చంద్రబాబు మాదిరి తనకు వాచీ , ఉంగరం లేదని, ఏదోలా బతుకుతున్నాను అని చెప్పడానికే ఈ విరాళాల సేకరణ అని అంటున్నారు. వాస్తవానికి జనసైనికులే తల్లిదండ్రులమీద ఆధారపడి బతుకుతుంటారు. వారి జేబు ఖర్చులకే పేరెంట్స్ నుంచి వంద యాభై అడిగి తీసుకుంటారని, ఇప్పుడు వారి దగ్గరున్న ఆ చిల్లర సైతం లాగేసేందుకు పవన్ కల్యాణ్ భలే ఎత్తులు వేశారని సెటైర్లు వినిపిస్తున్నాయి.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment