భారతదేశ ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లేటెస్ట్ వెర్షన్ పాన్ 2.0 ప్రారంభించే ప్రణాళికలను ఆవిష్కరించారు. లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద 1972లో ప్రవేశపెట్టిన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ప్రవేశపెట్టారు. ఆ తరువాత పాన్ ఎప్పుడూ అప్డేట్ అవ్వలేదు.. కాగా ఇప్పటికే డిజిటల్ అప్డేట్ అందుకుంది. ఇప్పటికి 78 కోట్లకు పైగా సాధారణ పాన్‌కార్డులను జారీ చేశారు. అయితే రాబోయే రోజుల్లో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
1,435 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో.. ఆదాయపు పన్ను శాఖ కోసం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సోమవారం ఆమోదం తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచునికి ఈ పాన్ 2.0 ప్రవేశపెట్టారు.
#Cabinet approves PAN 2.0 Project of the Income Tax Department enabling technology driven transformation of Taxpayer registration services #CabinetDecisions pic.twitter.com/iQhZCgGWGu
— Dhirendra Ojha (@DG_PIB) November 25, 2024
Comments
Please login to add a commentAdd a comment